English | Telugu

జ‌బ‌ర్ద‌స్త్ కు హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ గుడ్ బై

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలు గ‌త కొంత కాలంగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటున్నాయి. ఈ సోలో ప్ర‌ధానంగా హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను త‌మ‌దైన శైలి స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ ఈ షోల‌కు ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకొచ్చారు. అంతే కాకుండా ఈ రెండు షోల‌కు సుడిగాలి సుధీర్ - ర‌ష్మీల ల‌వ్ ట్రాక్ మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింది. షోల‌ని మ‌రింత పాపుల‌ర్ చేసింది. వీళ్ల కోస‌మే ఈ షోల‌ని ప్ర‌త్యేకంగా చూసే వారున్నారు.

ఇక ఈ షోల‌లో సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను ఓ టీమ్ గా , హైప‌క్ ఆది త‌దిత‌రులు మ‌రో టీమ్ గా ఏర్ప‌డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ముందు నుంచి వున్న టీమ్ మెంబ‌ర్స్ ఒక్కొక్క‌రుగా జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌ని వీడుతూ వ‌స్తున్నారు. ముక్కు అవినాష్, అదిరే అభి, చ‌మ్మ‌క్ చంద్ర‌, కిరాక్ ఆర్పీ, అప్పారావు షోని వీడారు. వారి త‌రువాత సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్, హైప‌ర్ ఆది త‌మ టీమ్ లతో ఆ లోటు క‌నిపించ‌కుండా ఇంత కాలం ఎంట‌ర్ టైన్ చేస్తూ వ‌చ్చారు.

దాదాపు ప‌దేళ్ల ప్ర‌యాణంలో ఎక్క‌డా ఈ షోకు బ్రేకులు ప‌డ‌లేదు. అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న షోలుగా జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ రికార్డులు సాధించాయి. అయితే ఇప్ప‌డు జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లు క్రమ క్ర‌మంగా త‌న ప్రాభ‌వాన్ని కోల్పోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క‌రుగా షోని వీడుతున్న నేప‌థ్యంలో తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ కు ఆది, సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్ సినిమాల‌తో పాటు ఇత‌ర టీవీ షోల్లో బిజీగా మారిపోవ‌డంతో ఈ ఇద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.