English | Telugu

వేదిక‌పైనే హిమని కొట్టి షాకిచ్చిన‌ జ్వాల!


బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఈ రోజు ఎపిసోడ్ వివ‌రాలు ఏంటో ఒక‌సారి చూద్దాం. హైద‌రాబాద్ క్ల‌బ్ అవార్డ్‌ ఫంక్ష‌న్ మొద‌ల‌వుతుంది. ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లే ఈ ఫంక్ష‌న్ కు చీఫ్ గెస్ట్ లు. సౌంద‌ర్య స్పీచ్ ఇస్తున్న స‌మ‌యంలో జ్వాల ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్క‌డే వున్న హిమ‌ని చూసి ఇదేంటీ ఇక్క‌డుంది.. మ‌నం వెన‌క్కి వెళ్లిపోవాలి అనుకుంటుంది. కానీ నేను ఎందుకు భ‌య‌ప‌డాలి అని మ‌ళ్లీ అక్క‌డే కూర్చుంటుంది. ఆ త‌రువాత జ్వాల‌ని చూసిన ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లు త‌ను ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చింది అనుకుంటారు.

అదే స‌మ‌యంలో జ్వాల చేసిన గొప్ప‌ప‌ని గురించి చెప్పి త‌న‌ని అవార్డు తీసుకోవ‌డానికి రావాల‌ని పిలుస్తారు. ఆ మాట‌లు విని హిమ ఆనంద‌ప‌డుతుంది. ఇక అవార్డులు ఇస్తున్న సౌంద‌ర్య కూడా హ్యాపీగా ఫీల‌వుతుంది. కానీ లోలోన త‌న మ‌న‌వ‌రాలికే అవార్డ్ ఇస్తున్నాన‌ని చెప్పుకోలేక‌పోతున్నాన‌ని ఫీల‌వుతుంది. ఇంత‌లో త‌న‌కు అవార్డ్ ఇచ్చేది మీరు కాద‌ని డాక్ట‌ర్ హిమ అని నిర్వాహ‌కులు చెప్ప‌డంతో జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది. హిమ‌నే సీరియ‌స్ గా చూస్తూ వుంటుంది. హిమ ఎవ‌రో కాదు సౌంద‌ర్య మ‌న‌వ‌రాల‌ని ఎవ‌రో చెప్ప‌డంతో జ్వాల మ‌రింత ఆగ్ర‌హానికి గుర‌వుతుంది.

హిమ భయం భ‌యంగా స్టేజ్‌ ఎక్కుతుండ‌గానే జ్వాల త‌న చెంప ప‌గ‌ల‌గొడుతుంది. నువ్వు హిమ‌వా? ఇన్నాళ్లూ నాకు ఎందుకు చెప్ప‌లేదు అని అడుగుతుంది. నా ప‌క్క‌నే ఉంటావ్‌.. నా స్టోరీ వింటావ్‌.. నా ప్రేమ ను లాగేసుకుంటావ్ అని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నా డాక్ట‌ర్ సాబ్ ని దూరం చేస్తావ్‌.. పెళ్లి చేసుకుంటావ్‌.. నువ్వు మ‌హా మోస‌గ‌త్తెవి అని తిడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.