English | Telugu

గీతకు ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ వేరే లెవెల్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చక్కని కంటెస్టెంట్స్ తో మంచి సాంగ్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం ఈ వారం కూడా అలరించింది. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ గురించి హేమచంద్ర అడిగేసరికి జడ్జి కార్తిక్ మాట్లాడుతూ "నేను, నా సాంగ్స్ అంటే ఎంతో ఇష్టపడే ఒక లేడీ ఫ్యాన్ కేవలం నా సాంగ్స్ పాడడం కోసమే ఆమె పియానో నేర్చుకున్నారు" అని చెప్పాడు. తర్వాత గీత మాధురి మాట్లాడబోతుండగా "గీత ఫ్యాన్ నే ఇక్కడున్నా" అని కోటి చెప్పడంతో గీత ఫుల్ ఎక్సయిట్ అయ్యింది.

"నా బర్త్డే ఆగష్టు 24 1989 . ఈ నంబర్స్ వచ్చేలా వన్ రూపీ, ఫైవ్ రూపీ ఇలా అన్ని రకాల నోట్స్ కలెక్ట్ చేసి నాకు పంపించాడు. ఆ అబ్బాయి దాని కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు. దాని కింద అతని పేరు కూడా రాసుకోలేదు. థ్యాంక్యూ గీతక్క..ప్రేమతో పవన్ కళ్యాణ్ అభిమాని" అని రాసి పంపించాడు అని చెప్పింది. ఇక థమన్ మాట్లాడుతూ "దాస్ అని నాకు ఒక అభిమాని ఉన్నాడు. ఆయన నా మీద అభిమానాన్ని చాటేందుకు మౌంట్ ఎవరెస్టు ఎక్కి అక్కడ నా ఫోటో పట్టుకుని నిలబడ్డాడు. అది చాలా ఫెంటాస్టిక్ మూమెంట్. మనమైతే ఏ కొండా ఎక్కలేము చాలా కష్టం. ఎవరెస్ట్ కన్నా హైట్ గా ఎదిగావ్ కదా..ఈ సందర్భంగా నా ఫ్యాన్ దాస్ కి థ్యాంక్యూ చెప్తున్నా..." అంటూ అతని ఫోటోను కూడా బ్యాక్ గ్రౌండ్ లో చూపించాడు. తర్వాత సింగర్ కార్తికేయకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది ఆడియన్స్ లో అని చెప్పాడు హేమచంద్ర.

ఇక కార్తికేయ మాట్లాడుతూ "నేను, నా పేరెంట్స్ అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు..మా చెల్లి నన్ను బాగా టీజ్ చేస్తోంది" అని చెప్పాడు. ఇక కార్తికేయ "లంకేశ్వరుడు" మూవీ నుంచి "పదహారేళ్ళ వయసు" సాంగ్ ని ఇరగదీసి పాడి వినిపించాడు. ఆ కుర్రాడి పాటకు కోటి సీట్ లోంచి లేచి స్టేజి మీద వెళ్లారు. ఇక జడ్జెస్ అందరూ కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఇపోయారు. కోటి - కార్తికేయ ఇద్దరూ కలిసి స్టేజి మీద గిటార్ తో జుగల్బందీ చేసి ఆకట్టుకున్నారు. కార్తికేయ వయసు 16 . ఇదే ఏజ్ లో తాను కెరీర్ స్టార్ట్ చేసినట్టు చెప్పారు కోటి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.