English | Telugu

 కాఫీ అఫైర్స్ తో బిజినెస్ లోకి బిగ్ బాస్ హౌస్ మేట్


గౌతమ్ కృష్ణ ఒక డాక్టర్. అతని గురించి అతను బిగ్ బాస్ సీజన్ 7 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తన ఆట తీరును ప్రదర్శించాడు. అలాగే సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లి ఆడాడు. రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్‌కి వచ్చేముందు.. గౌతమ్ హీరోగా ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. కేవలం హీరోగానే కాకుండా ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, ప్రొడ్యుసర్ కూడా గౌతమ్ కృష్ణ కావడం విశేషం. ఐతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన వాళ్లంతా మూవీస్ లో ఇతరత్రా ఆఫర్స్ కోసం వెయిట్ చేయకుండా సొంతంగా బిజినెస్ లు పెట్టుకుని ఎదుగుతున్నారు. రీసెంట్ గా సయ్యద్ సోహైల్ కళింగపట్నం అనే రెస్టారెంట్ ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు. అలాగే టేస్టీ తేజ ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు.

ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో సెటిల్ అవుతున్నారు. ఇక రీసెంట్ గా గౌతమ్ కృష్ణ కూడా "మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫైర్స్" పేరుతో ఒక కాఫీ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు. ఎవ్వరైనా సరే తన రెస్టారెంట్ ని విజిట్ చేయొచ్చని అక్కడ మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంటుందని చెప్పాడు. ఐతే ఇది తన ఫ్రెండ్ నిర్వహిస్తూ ఉండగా..తనతో అసోసియేట్ అయ్యాయని చెప్పాడు. ఈ బ్రాండ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నాడు. బిగ్ బాస్ చూసిన వాళ్ళు , చూడని వాళ్ళు ఎవ్వరైనా సరే తన రెస్టారెంట్ ని విజిట్ చేయొచ్చని చెప్పాడు అలాగే మరో బ్రాంచ్ ని కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం అని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఇంకా రాలేదని చెప్పాడు. త్వరలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హోస్ట్ నాగార్జునను పిలవడానికి ట్రై చేస్తానని చెప్పాడు. ఇక తన రెస్టారెంట్ లో హెల్తీ బాయ్ మెనూ అనేది స్టార్ట్ చేసినట్లు చెప్పాడు. రామ్ చరణ్ అంటే తనకు నటనలో ఇన్స్పిరేషన్ అన్నాడు. త్వరలో తాను నటించిన "సోలో బాయ్" మూవీ రిలీజ్ కాబోతోంది అని దానిని అందరూ ఆదరించాలని చెప్పాడు. సయ్యద్ సోహైల్ కూడా తన ఫ్రెండ్ పెట్టిన కళింగపట్నం రెస్టారెంట్ కోసం తన ఫ్రెండ్ తో అసోసియేట్ అయ్యి ఆ రెస్టారెంట్ ని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇక గౌతమ్ కృష్ణ కాఫీ అఫైర్స్ రెస్టారెంట్ కి బెజవాడ బేబక్క, రౌడీ రోహిణి, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, సయ్యద్ సోహైల్, విజె సన్నీ, శేఖర్ బాషా, ముక్కు అవినాష్, మెహబూబ్ వంటి వాళ్లంతా వచ్చి విష్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.