English | Telugu

ఐదేళ్ల తర్వాత.... నాగార్జున గారికే ఎసరు పెట్టావా శ్రీముఖి...

త్వరలో వినాయక చవితి పండగ రాబోతోంది.. ఈ నేపథ్యంలో ఛానెల్స్ అన్నీ కూడా ఫెస్టివల్ థీమ్ తో షోస్ ని డిజైన్ చేశాయి. నెమ్మదిగా ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో "గణపతి బప్పా మోరియా" పేరుతో ఒక షో పండగ రోజున టెలికాస్ట్ కాబోతోంది. ఇక ఈ షోకి ఇద్దరు టాప్ హోస్టులు వచ్చారు. వాళ్ళే ప్రదీప్, శ్రీముఖి. ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపై క్రేజి కాంబో అంటూ ఈ షోకి మాటల మాయాజాలంతో అలరించడానికి ప్రదీప్ అలాగే స్టేజి మీద తూఫాన్ సృష్టించడానికి శ్రీముఖి ఇద్దరూ ఫెస్టివ్ గెటప్ లో వచ్చేసారు. "ఈరోజు ఈ వినాయక చవితికి ఒకటే ఒకటి కోరుకున్నా ప్రదీప్" అంటూ శ్రీముఖి అంది. " ఎం కోరుకున్నావ్" అని భయపడుతూ అడిగాడు. "ఇంకా స్టార్ మాలో చాలా ఎక్కువ షోస్ చేయాలని ఆ దేవుడిని కోరుకున్నా" అంది. వెంటనే ప్రదీప్ "పొద్దున్న వచ్చే రాశి ఫలాలు షో తప్ప మిగతా అన్ని షోస్ లో నువ్వే ఉంటున్నావ్" అన్నాడు. దానికి శ్రీముఖి బాగా హర్ట్ అయ్యి బుంగమూతి పెట్టేసింది.

"కుకు విత్ జాతిరత్నాలు చేసానా ఏంటి...ఇంకో నెలలో బిగ్ బాస్ వస్తోంది. అది చేస్తానా ఏంటి" అని నిష్ఠూరంగా అడిగింది. "నా యాంకరింగ్ ఎసరు పెట్టిన పర్లేదు నాగ్ సర్ కె ఎసరు పెట్టావా" అని అడిగాడు ప్రదీప్. "ఫస్ట్ టైం స్టార్ మాలో పండగ ఈవెంట్ చేస్తున్నావ్ ఎలా ఉంది" అని అడిగింది. "ఇప్పుడు హోమ్ థియేటర్ ఉంది. దాని పక్కన సెల్ ఫోన్ ఉంది. అది మోగితే వినిపిస్తుందా" అని అడిగాడు ప్రదీప్. "వినిపించదు. ఎందుకంటే హోమ్ థియేటర్ సౌండ్ లో కలిసిపోతుంది కదా" అంది శ్రీముఖి. "నా భయం కూడా అదే" అన్నాడు ప్రదీప్. దాంతో శ్రీముఖి ఓహో అంటూ నవ్వేసింది. "నేను ఫైర్ ఐతే నువ్వు వాటర్..మనిద్దరం కలిస్తే ఈ పండగ బ్లాక్ బస్టర్" అంటూ చెప్పింది శ్రీముఖి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.