English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఎమోషనల్ అయిన సీతాకాంత్.. రామ్ గురించి తన ఆలోచన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -379 లో..... రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు రామ్ చెప్పాడని ఒకరికొకరు పాయసం తినిపించుకుంటారు. అదంతా చూడలేని శ్రీలత, సందీప్, శ్రీవల్లి బయటకు వచ్చి కుళ్ళుకుంటారు. అయిపోయింది అంతా అయిపోయింది బావ గారు , మైథిలీ భార్యాభర్తలు అయినట్టు అలా తినిపించుకోవడం నాకు నచ్చలేదని శ్రీవల్లి అంటుంది. ఇంతవరకు ఏం చేసిన ఈ ఆస్తికి నిన్ను వారసుడుగా చూడడం కోసమే.. కొన్ని రోజులు ఓపిక పట్టు సందీప్ అని శ్రీలత అంటుంది.

ఆ పసివాడు భాగయ్యాక అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను. అప్పటివరకు ఓపిక పట్టండి అని శ్రీవల్లి , సందీప్ లతో శ్రీలత అంటుంది. మరొకవైపు ఫణీంద్ర, సుశీల మాట్లాడుకుంటుండగా అప్పుడే రామలక్ష్మి వస్తుంది. రామ్ సిచువేషన్ చెప్తుంది. అయితే సీతాకాంత్ నిన్ను పెళ్లి చేసుకోమని అడిగే ఉంటాడే అని ఫణీంద్ర అనగానే.. లేదు నానమ్మ అడగలేదు, నేను మైథిలీ అని తను నమ్ముతున్నాడు.‌ అందుకే మీకు ఇబ్బంది అయితే వెళ్ళండి అని అంటున్నాడని ఫణింద్ర వాళ్ళకి చెప్తుంది రామలక్ష్మి. దీనికి సొల్యూషన్ స్వామి దగ్గరికి వెళ్తేనే తెలుస్తుందని రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్తుంది. ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని రామలక్ష్మి అడుగుతుంది. మీకు ఇది పునర్జన్మ.. ఇప్పుడు మీరు కలిసి బ్రతకాలని దైవ నిర్ణయం అయితే కలిసి ఉండాలని స్వామి అంటాడు. బాబుని కాపాడుకునే మార్గం చెప్పండి అని రామలక్ష్మి అడుగుతుంది. హోమం చెయ్యాలని స్వామి చెప్తాడు.

ఆ తర్వాత రామ్ అర్ధరాత్రి నిద్రలేచి.. సారీ సీతా నిన్ను ఇబ్బంది పెట్టలేనని తన కాళ్ళు మొక్కి వెళ్లిపోతుంటాడు. అప్పుడే సీతాకాంత్ చూసి రామ్ ని ఆపుతాడు. ఎక్కడికి అని అంటాడు. రామ్ ఏడుస్తూ చనిపోవడానికి అని అనగానే అలా అనొద్దు అని చెప్తాడు. నన్ను అందరూ ఒంటరిని చేసి వెళ్తున్నారని సీతాకాంత్ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రామ్ పరిస్థితి గురించి రామలక్ష్మి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.