English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. వారి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.... రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంట్లోకి వస్తారు. వాళ్ళని చూసి సిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎప్పుడు కలిసి ఉండాలి అన్నయ్య.. మీరు ఎక్కడికి వెళ్ళకూడదని అనగానే.. మేము ఎక్కడికి వెళ్ళాము. నువ్వు హ్యాపీగా ఉండడం కావాలని రామలక్ష్మి అంటుంది. అన్నయ్య వాళ్ళు ఇంటికి వచ్చేలా చేసినందుకు.. చాలా థాంక్స్ అమ్మ అని సిరి శ్రీలతతో సిరి చెప్తుంది. నాకు చాలా ఆకలిగా ఉందని సిరి అనగానే ఉండు నీకు ఇష్టమైన వంట చేస్తానని శ్రీలత కిచెన్ లోకి వెళ్తుంది.

కుట్రలతో ఉండే అత్తయ్య ఇలా సడెన్ గా మారడం ఏంటని శ్రీవల్లి ఆలోచనలో పడుతుంది.
రామలక్ష్మి, సీతాకాంత్ లు తమ గదిలోకి వస్తారు. తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. సీతాకాంత్ రామలక్ష్మిని సోఫా లో కూర్చోపెట్టి తను కింద కూర్చొని ఉంటాడు. రామలక్ష్మిపై తన ప్రేమని చెప్తాడు. రామాలక్ష్మి కూడా తన ప్రేమని చెప్తుంది. మరొక వైపు శ్రీలత కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి వస్తుంది.. ఎక్కడ తనని హెల్ప్ చెయ్యమంటుందో అని వెళ్లి పోతుంటే శ్రీలత చూసి రమ్మని హెల్ప్ చెయ్యమంటుంది. అత్తయ్య ఇక్కడ ఎవరు లేరు.. మీరు ఇదంతా యాక్ట్ చేస్తున్నారు కదా మారలేదు కదా అని శ్రీవల్లి అనగానే.. శ్రీవల్లి చెంప చెల్లుమనిపిస్తుంది శ్రీలత. నేను పూర్తిగా మారిపోయాను ఇన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టానని శ్రీవల్లితో శ్రీలత అంటుంటే.. అదంతా రామలక్ష్మి వింటుంది.

ఆ తర్వాత శ్రీలత కూరలో ఉప్పు వేస్తూ.. కన్నింగ్ గా ఒక నవ్వు నవ్వుతుంది. దాన్ని బట్టి తెలుస్తుంది మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉందని...ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. సీతాకాంత్ ఎప్పటిలాగ హుందాగా పై నుండి కిందకి వస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందని రామలక్ష్మి అనుకుంటుంది. మమ్మల్ని క్షమించి వచ్చినందుకు థాంక్స్ అని సందీప్ సీతాకాంత్ తో అనగానే.. మిమ్మల్ని నేను క్షమించలేదని సీతాకాంత్ అంటాడు. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.