English | Telugu
Eto Vellipoyindhi Manasu : నందిని గురించి తెలిసి షాకైన రామలక్ష్మి.. భర్తని అడగగలదా!
Updated : Dec 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -280 లో... సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. ఇప్పుడు మన షేర్ వాల్యూ పెరిగింది కదా ఇప్పుడే మన కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని అనగానే గుడ్ ఐడియా అని సీతాకాంత్ అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ప్లేస్ కోసం చూస్తుంటారు. అప్పుడే నందిని వచ్చి నేను ఆల్రెడీ ప్లేస్ సెలక్ట్ చేసానని అంటుంది. ఎక్కడ అని సీతాకాంత్ అడగగా బెంగుళూరు అని నందిని చెప్తుంది.
అప్పుడే అక్కడికి సందీప్, ధనలు వస్తారు. బెంగుళూరు వద్దు.. అక్కడ ఆల్రెడీ చాలా కంపెనీలున్నాయ్.. మన కంపెనీ సెటిల్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. పూణేలో పెడితే తక్కువ టైమ్ లో డెవలప్ కావచ్చని ధన అంటాడు. చాలా బాగా చెప్పావని సీతాకాంత్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ పూలు తీసుకొని వస్తాడు. తన చేత్తో రామలక్ష్మి తలలో పెడతాడు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సందీప్ ప్రొద్దున నందిని చేసిన అవమానం భరించలేక ఆవేశపడుతూ.. జరిగింది శ్రీలత, శ్రీవల్లిలకి చెప్తాడు. దాని సంగతి నేను చెప్తానని శ్రీలత అంటుంది.
మరుసటిరోజు ఉదయం శ్రీలత కిచెన్ లో వర్క్ చేస్తుంది. మీరు ఎందుకు చేస్తున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఇలా చెయ్యడం హ్యాపీగా ఉందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామాలక్ష్మితో శ్రీలత మాట్లాడుతుంది. నేనొకటి చెప్పాలి కంపెనీ పార్టనర్ గా ఉన్న నందిని సీతాకాంత్ పార్టనర్ కావాలని అనుకుంటుంది. నేను మారక ముందు నాతో మిమ్మల్ని విడగొట్టాడానికి హెల్ప్ చేసింది.. తనతో జాగ్రత్త అని శ్రీలత రామలక్ష్మికి చెప్పగానే తను షాక్ అవుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ షర్ట్ బటన్ పోయిందని రామలక్ష్మి నీ పిలుస్తాడు. కానీ రామలక్ష్మి ఆలోచిస్తూ బటన్ కుడుతుంది. ఇప్పుడు నందిని గురించి సీతాకాంత్ ని అడగాలా వద్దా అని రామలక్ష్మి అడగకుండా ఉంటుంది. రామలక్ష్మి మీటింగ్ గురించి ఆలోచిస్తున్నట్లుందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.