English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లికి ప్రేమ విలువ తెలియజెప్పిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -272 లో....రామలక్ష్మి ప్లాన్ ప్రకారం అందరిని గుడికి తీసుకొని వెళ్తుంది. అక్కడ సిరి మోకాళ్ళపై నడుస్తుంటే.. ఎందుకు అలా చేస్తున్నారని అడుగుతుంది. జాతకం లో దోషాలు ఉంటే మొక్కుకొని అలా చేస్తే బాగుంటారని పంతులు చెప్పగానే.. మా అమ్మ కోసం నేనే చేస్తానని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ తన తల్లి శ్రీలత బాగుండాలని మోకాళ్ళ పై నడుస్తాడు. ఆ బాధని చూడలేని రామలక్ష్మి.. చూసావా ఇప్పటికైనా మీ కొడుకు ప్రేమని అర్థం చేసుకోండి అని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. అయినా కూడా శ్రీలత నాకేంటి అన్నట్టు మాట్లాడుతుంది. సీతా ఎప్పుడు కూడా నా కొడుకు కాలేడని శ్రీలత అంటుంది. నువ్వు సొంత కొడుకువే కదా మరి నువ్వు ఎందుకు మీ అమ్మ గురించి అలా చెయ్యడం లేదని సందీప్ తో రామలక్ష్మి అంటుంది. దాంతో రామలక్ష్మి మాటలు తట్టుకోలేక సందీప్ వెళ్లి మోకాళ్ళపై ప్రదక్షిణలు చేస్తాడు. ఇక వీళ్ళు మారేలా లేరని మాణిక్యానికి ఫోన్ చేసి లాయర్ ఇంకా శంకర్ ని తీసుకొని రమ్మని చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ ప్రదక్షిణలు చేస్తుంటాడు కానీ సందీప్ మాత్రం ప్రదక్షిణ ఆపేస్తాడు.

అప్పుడే రామలక్ష్మి వచ్చి శంకర్ ఇంకా లాయర్ ని చూపిస్తుంది. దాంతో సందీప్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు చెప్పండి వాళ్ళు వచ్చి మీ అన్నయ్యకి చెప్తే పరిస్థితి ఏంటి? మీకు డబ్బు కావాలా అమ్మ కావాలా అని రామలక్ష్మి అనగానే.. నాకు డబ్బు కావాలని సందీప్ శ్రీవల్లి అంటారు. దాంతో శ్రీలత షాక్ అవుతుంది. సందీప్, శ్రీవల్లిని పంపిస్తుంది రామలక్ష్మి. అక్కడ నుండి లాయర్ , శంకర్ లని పంపిస్తుంది. శ్రీలత ని పక్కకి తీసుకొని వెళ్లి.. ఇప్పటికైన అర్థమైందా ఎవరి ప్రేమ ఇలాంటిందోనని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.