English | Telugu

ప్రమాదమేమీ లేదు.. తల్లీ బిడ్డ క్షేమమే.. ఊపిరి పీల్చుకున్న కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -236 లో......సిరి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే రామలక్ష్మి హాస్పిటల్ కి తీసుకొని వస్తుంది. శ్రీలత, శ్రీవల్లి వాళ్ళంతా అక్కడికి వస్తారు. సిరికి ఏమవుతుందోనని శ్రీలత టెన్షన్ పడుతుంటే.. ఏం కాదు అత్తయ్య.. మీరు టెన్షన్ పడకండి అని రామలక్ష్మి అంటుంది. అంత మీరే చేశారు నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరేనని రామలక్ష్మిని శ్రీలత తిడుతుంటుంది

అప్పుడే సీతాకాంత్ వస్తాడు. వీళ్ళే ఏదో చేశారని రామలక్ష్మి కుటుంబంపై శ్రీలత నిందలు వేస్తుంది. మేమ్ ఏం చేస్తామని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఈ ఆస్తి కోసం ఇదంతా చేసావ్.. సిరికి పుట్టబోయే బిడ్డ నీకు అడ్డుగా ఉంటాడని ఇలా చేసావని శ్రీలత అంటుంది. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రామలక్ష్మికి ఇవ్వనన్న శ్రీలత మాటలని సీతాకాంత్ గుర్తుచేసుకుంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ప్రమాదమేమీ లేదు. తల్లీబిడ్డ ఇద్దరు బాగున్నారు. ఇది మాములు కడుపు నొప్పి అని చెప్తుంది. దాంతో ఇప్పుడేం అంటావ్ చెల్లెమ్మ.. మేమ్ ఏదో విషమిస్తే ఇలా అయిందన్నట్లు మాట్లాడావని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత అందరు సిరి దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. సిరిని చూసి సీతాకాంత్ ఎమోషనల్ అవుతుంటే.. ఎందుకు అన్నయ్య భాదపడుతున్నావ్.. నువ్వు బాగా చూసుకుంటావ్.. వదిన తల్లి ప్రేమ మరిపించేలా చూసుకుంటదని సిరి అంటుంది.

ఆ తర్వాత అభిని శ్రీలత హాస్పిటల్ దగ్గరికి పిలిచి మాట్లాడుతుంది. ఎంత వరకు వచ్చిందంటు అభికి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి అభి కన్పిస్తాడు. వాడు అభిలా ఉన్నాడు ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే అభి తనని చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.