English | Telugu

Eto Vellipoyindhi Manasu : డిటెక్టివ్ చెప్పినా నమ్మని సీతాకాంత్.. ఆ నిజం తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -218 లో.. నువ్వు అమావాస్య రోజు వరకు ఇంట్లో నుండి వెళ్ళకని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. మీరు నా గురించి ఇంత ఆలోచిస్తన్నప్పుడు నేను మీ మాట వింటాను. ఎక్కడికి వెళ్ళనని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళానంటూ మాట ఇవ్వు అనగానే సీతాకాంత్ కి రామలక్ష్మి మాటిస్తుంది.

ఆ తర్వాత నందిని ఇంటికి వస్తుందిమ సందీప్ ని ఇదంతా చేసాడని ఏది క్లారిటీగా తెలియడం లేదని నందినికి హారిక చెప్తుంది. కానీ నందిని సీతాకాంత్ విషయం లో ఎమోషనల్ అవుతుంది. నన్ను ఎందుకు సీతా తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడు. తన ప్రేమ కావాలని మాత్రమే కోరుకుంటున్నాను కదా అని నందిని అంటుంది. నాకు సీతా కావాలి లేదంటే నేను ఉండలేనని నందిని ఎమోషనల్ అవుతుంది. అదంతా డిటెక్టివ్ వింటుంటాడు. పక్కకి వెళ్లి డిటెక్టీవ్ సీతాకాంత్ కి ఫోన్ చేస్తాడు. మీరు నందిని గారిని తప్పు అర్ధం చేసుకున్నారు కేవలం ఆమె మీపై ప్రేమతో మాత్రమే ఉంది పగతో లేదని చెప్తాడు. దానికి సాక్ష్యం ఉందా అని సీతాకాంత్ అడుగుతాడు. చెడుకి సాక్ష్యం కావాలి కానీ మంచికి ఎందుకని డిటెక్టివ్ అంటాడు. నాకు కావాలని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ పై ఎటాక్ చేసిన రౌడీ.. సీతాకాంత్ ఇంటికి వచ్చి బొకే ఇస్తాడు. సందీప్ డబ్బులు ఇవ్వలేదని బాంబు పెడుతాడు‌. సెక్యూరిటీతో ఆ బొకే పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఏంటని చూసేసరికి.. అందులో పెండ్రైవ్ ఉంటుంది. పెన్ డ్రైవ్ లో గుడిలో యాగం చేసిన ఫోటోలు ఉంటాయి. ఇవి ఆ రౌడీ గాడు పంపి ఉంటాడని శ్రీలత టెన్షన్ పడుతుంది. ఎవరు పంపి ఉంటారని సీతాకాంత్ అంటాడు. ఎవరో నీకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సందీప్ దగ్గరికి శ్రీలత వెళ్లి.. వాడి డబ్బులు వాడికి ఇవ్వమంటూ కోప్పడుతుంది. ఆ తర్వాత రౌడీతో సందీప్ ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.