English | Telugu

బెడ్ రూమ్ లో బొమ్మ బొరుసు ఆడుకుంటున్న భార్యాభర్తలు.. అత్త ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -237 లో.....రామలక్ష్మికి అభి ఎదరుపడి మాట్లాడితే సీతాకాంత్ కి డౌట్ వస్తుందని అనుకుంటాడు. అభి రామలక్ష్మి దగ్గరికి వస్తుంటే మాణిక్యం కన్పించడంతో అభి భయపడి వెళ్ళపోతాడు. ఆ తర్వాత సిరిని డిశ్చార్జ్ చేసి పంపిస్తుంటారు.

మరొకవైపు శ్రీలత చేస్తున్న కుట్ర మోసం గురించి శ్రీలతతో మాణిక్యం మాట్లాడుతాడు. నా కూతురు జోలికి రాకు అంటు మాణిక్యం వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏంటి ఏదో జాగ్రత్త అంటున్నావని సీతాకాంత్ అనగానే.. సిరి జాగ్రత్త అంటున్నానని మాణిక్యం కవర్ చేస్తాడు. ఎందుకు తనతో పెట్టుకుంటున్నావ్.. ఆవిడ బుద్ది అసలే మంచిది కాదని సుజాత అనగానే.. ఆ శ్రీలత కి నేను అంటే భయం పుట్టాలి.. లేదంటే కూతురు అల్లుడిని కలిసి ఉండనివ్వదని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సిరిని సీతాకాంత్ జాగ్రత్త గా చూసుకుంటుంటే.. అపుడే రామలక్ష్మి వచ్చి నేను చూసుకుంటాను. మీరు మీ పని చూసుకోండి అని చెప్తుంది.

ఆ తర్వాత అభి ఎందుకు వచ్చాడని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అత్తయ్య చెప్పిన మాటలు నమ్మేసినట్లున్నాడని రామలక్ష్మి అనుకుంటుంది. నా గురించి తప్పుగా అనుకుంటున్నారా అని రామలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు వేరే ఆలోచనలో ఉన్నా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నందినికి శ్రీలత ఫోన్ చేసి.. సందీప్ ని చైర్మన్ చెయ్ అని అంటుంది. ఇద్దరి అవసరం ఈక్వల్ గా ఉంది.మ టైమ్ వచ్చినప్పుడు చేస్తానని నందిని అంటుంది.ఆ తర్వాత ఆ శ్రీలతతో జాగ్రత్త అని నందినితో హారిక అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ దగ్గరికి పాలు తీసుకొని వస్తుంది. ఇద్దరు ఫన్నీ ఒక గేమ్ ఆడతాడు. బొమ్మ బొరుసు వేస్తుంది. బొమ్మ పడితే నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటుంది. బొమ్మ పడుతుంది నేను చెప్పినట్టు చెయ్యాలని రామలక్ష్మి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.