English | Telugu

దేవయాని ప్లాన్‌ను చెడ‌గొట్టిన రిషి!

'వసుని నువ్వే రక్షించాలి' అంటూ రిషి, 'రిషి సర్ కి నా మీద కోపం తగ్గిపోవాలి' అంటూ వ‌సు చిట్టీలురాసి అమ్మవారి దగ్గర పెడతారు ఇద్దరూ. మరో వైపు జగతి ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తాడు మహేంద్ర. జగతి ముందరే రిషికి కాల్ చేస్తాడు కానీ రిషి కట్ చేస్తాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. అప్పుడు రిషి లిఫ్ట్ చేసి "మళ్ళీ ఫోన్ చేస్తాను డాడ్" అని ఫోన్ పెట్టేస్తాడు. జగతి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది.

మరో పక్క రిషి ఫ్యామిలీ మొత్తం వసుధార గెలుపు మీద ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. విషయం తెలుసుకుని "ఆకాశమంత పందిరేసి, భూదేవంత పీటేసి, టీవీ చానెల్స్ ని పిలిపించి అభినందన సభ ఏర్పాటు చేయండి" అంటుంది వెటకారంగా. ఫణీంద్ర కూడా "దేవయాని చెప్పినట్లే చేయండి." అని మహేంద్రకు చెప్తాడు.

ఇక దేవయానికిఏం చేయాలో తెలీక రిషి మీద దొంగ ప్రేమను చూపిస్తూ నటిస్తుంది. ఇంతలో గౌతమ్ వచ్చి "వసుకి అభినందన సభ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను" అని రిషితో అంటాడు. దేవయాని ఆ విషయాన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తుంది. రిషి రివర్స్ లో "సభ పెట్టి వసుని అభినందిస్తే తప్పేముంది" అనేసరికి దేవయాని ప్లాన్ ఫ్లాప్ అవుతుంది.

అక్కడ వసు అక్కడున్న పిల్లలకు అన్నం కలిపి ముద్దలు పెడుతూ రిషి గురించి ఊహించుకుంటూ ఉంటుంది. ఇక రెండో రోజు రిషి.. వసు రూమ్ కి వచ్చి చూస్తూ ఉంటాడు. కానీ వసు లేకపోయేసరికి వెయిట్ చేస్తాడు. ఇంతలో వసు బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ కనిపించేసరికి వసు ఇంత కష్టపడుతోందా అనుకుని మనసులో బాధపడతాడు. మిగతా సీరియల్ హైలైట్స్ కోసం ఈరోజు ఈవెనింగ్ ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.