Read more!

English | Telugu

నీడలా వెంటాడుతున్న రాజీవ్... వసుధార ఏం చేయనుంది!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -676 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో... కాగితపు పడవలను నీళ్లలో వదిలేసి రిషి, వసుధార ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. "రిషి సర్ ఎందుకు వచ్చాడు" అని వసుధార అనుకోగా... "వసుధార ఎందుకు వచ్చింది" అని రిషి అనుకుంటాడు. సర్ మీరు ఇక్కడ ఏంటని వసుధార అడుగగా.. "నాకు ఒకరు చెప్పారు.. మనసులో ఏదైనా అనుకొని కాగితపు పడవ మీద రాసి నీటిలో వదిలితే కోరిక నెరవేరుతుందని. అందుకే ఇక్కడికి వచ్చాను" అని అంటాడు రిషి. మీకు చెప్పిన వాళ్ళు రాలేదా సర్ అని సరదాగా అంటుంది వసుధార. ఇక ఇద్దరు వాళ్ళు రాసి వదిలిన పడవల మీద ఏం రాసారో ఒకరికొకరికి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటారు. మళ్ళీ డౌట్ వస్తోందేమోనని అనుకొని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు.

మరొకవైపు వసుధారని రిషి అర్థం చేసుకోలేకపోతున్నాడని చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రిషికి ఫోన్ చేసి నిజం చెప్పాలని ట్రై చేస్తాడు. "రిషి సర్ వసుధారకి పెళ్లి కాలేదు" అని చెప్తాడు. కానీ రిషి ట్రాఫిక్ లో ఉండటం వల్ల సరిగా వినిపించక.. ఎవరు ఎవరు అని అంటాడు. అంతలోనే వసుధార వచ్చి చక్రపాణి ఫోన్ లాక్కొని "ఏం చేస్తున్నారు నాన్న" అని కట్ చేస్తుంది. ఎవరో ఫోన్ చేసారు అని చక్రపాణి చెప్తాడు. అంతలోనే రిషి మళ్ళీ ఫోన్ చేసేసరికి అది చూసి వసుధార ఫోన్ కట్ చేసి రాంగ్ డయల్ అని మెసేజ్ పెడుతుంది. "నాన్న ఇంకెప్పుడు రిషి సర్ కి నిజం చెప్పాలని ట్రై చేయకండి.. అలా చేస్తే నా మీద ఒట్టే" అని చెప్తుంది వసుధార.

కాలేజ్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి రిషికి మీటింగ్ ఏర్పాటు చేయమని మెసేజ్ చేస్తుంది వసుధార. ఆ తర్వాత రిషి, జగతి, మహేంద్రలు మీటింగ్ కి బయల్దేరి వెళ్తారు.

మరొకవైపు రాజీవ్ కి కాల్ చేస్తుంది దేవయాని. "ఎక్కడి వరకు వచ్చింది నీ ప్లాన్" దేవయాని అడగుతుంది.  "ఒక ప్లాన్ ఉంది మేడమ్ జీ.. రిషి ఉన్నాడా" అని రాజీవ్ అడుగగా.. "అందరూ మీటింగ్ కి వెళ్లారు" అని దేవయాని చెప్పడంతో.. రాజీవ్ కూడా వెళ్తాడు.. ఎలాగైనా అందరి ముందు వసుధార  నా భార్య అని చెప్తా అనుకొని రాజీవ్ వెళ్తాడు. మీటింగ్ లో అందరూ కూర్చొని ఉంటారు. డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి నా వసుధార ఎక్కడ అని అడుగుతాడు. "ఓహ్ నేను ఎవరో తెలియదు కదు.. నేను వసుధార భర్తని" అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.