English | Telugu

ప్రేమ ఒక అబ‌ద్ధం.. దీప్తి సునైన పోస్ట్ వైర‌ల్‌!

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా హాట్ అందాల‌తో నెటిజ‌న్ల‌కు గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. గ‌త కొంత కాలంగా యూట్యూబ‌ర్‌, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫేమ్ షణ్ముఖ్ జ‌స్వంత్ తో ప్రేమ‌లో వున్న ఈ గ్లామ‌ర్ లేడీ అదే షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి హ‌న్మంత్ కార‌ణంగా ష‌ణ్ణుకు దూర‌మైంది. త‌న కంటే ష‌ణ్ణుకు సిరినే ఎక్కువ అని తెలుసుకున్న దీప్తి అత‌నికి బిగ్ బాస్ సీజ‌న్ ముగిసాక బ్రేక‌ప్ చెప్పేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఏదొక అంశ‌మై వార్త‌ల్లో నిలుస్తున్న దీప్తి తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచి వైర‌ల్ అవుతోంది.

బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయిన దీప్తి సునైన యూట్యూబ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మ‌రింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నిత్యం త‌న గ్లామ‌ర్ ఫొటో షూట్‌ల‌తోనూ నెటిజ‌న్‌ల‌ని ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఈ బ్యూటీని ఫాలోఅవుతున్న వారు 3.8 మిలియ‌న్స్.. అంటే 38 ల‌క్ష‌ల మంది అన్న‌మాట‌. ఇంత మంది ఫాలోవ‌ర్స్‌తో దీప్తి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అయితే తాజాగా త‌ను పెట్టిన ఓ పోస్ట్ ఇప్ప‌డు వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల విడుద‌లైన `విరాట‌ప‌ర్వం` చిత్రంలోని ఓ డైలాగ్ వీడియోను అభిమానుల‌తో షేర్ చేసింది. ఈ వీడియోలో సాయి ప‌ల్ల‌వి తాను ఎంత‌గానో ప్రేమిస్తున్న రానాని క‌లిసేందుకు ఆరాట‌ప‌డుతున్న స‌న్నివేశం అది. ఓ లెక్చ‌ర‌ర్‌ని రానా ఆచూకీ చెప్ప‌మ‌ని అడిగిన సంద‌ర్భంలో ఆయ‌న‌, ఇక్క‌డ ఎవ‌రిని ఎవ‌రు ప్రేమించ‌ర‌ని, మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోవ‌డ‌మే నిజ‌మ‌ని, ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబ‌ద్ధ‌మ‌ని చెబుతాడు. ఉన్న‌ట్టుండి దీప్తి ఈ డైలాగ్ వీడియోను పోస్ట్ చేయ‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది. త‌న ప్రేమ గురించి ఇండైరెక్ట్ గా చెప్పాల‌న్న ఉద్దేశ్యంలో భాగంగానే షణ్ణుపై దీప్తి సెటైర్ వేసింద‌ని నెటిజ‌న్లు కామెంట్‌ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.