English | Telugu

కార్తీక్‌, దీప‌ల‌కు సౌంద‌ర్య విడాకులిప్పిస్తుందా?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ఫ్యామిలీ డ్రామా `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా ట్విస్ట్‌లు.. మ‌లుపులతో ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా వింత పోక‌డ‌లు పోతూ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది. అయితే రేటింగ్ ప‌రంగా మంచి ఫేజ్‌లో వున్న ఈ సీరియ‌ల్ ఈ గురువారం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో ఆకట్టుకోబోతోంది. ఈ గురువారం 1212వ ఎపిపోడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సంద‌ర్భంగా ఏం జ‌ర‌గ‌నుందో ఒక‌సారి లుక్కేద్దాం.

డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఎల‌క్ష‌న్ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో స్టేజ్‌పై మాట్లాడుతున్న సౌంద‌ర్య‌ని ప‌క్క‌కు త‌ప్పించి డాక్ట‌ర్ కార్తీక్ అధ్య‌క్షుడిగా వుండాలంటే నాకు న్యాయం చేయాల్సిందే అంటూ కండీష‌న్ పెడుతూ కార్తీక్ గురించి చెడుగా మాట్లాడుతుంది మోనిత‌. వెంట‌నే చ‌ప్ప‌ట్లు కొడుతూ స్టేజ్‌పైకి వెళ్లిన దీప .. మైక్ ముందున్న మోనిత‌ని ప‌క్క‌కు నెట్టి తను చేసిన మోసాల గురించి చెబుతుంది. ఇన్ని మోసాలు చేసిన ఈవిడ అస‌లు డాక్ట‌ర్ వృత్తికే ప‌నికిరాద‌ని మోనిత‌కు షాకిస్తుంది. ఈ మాట‌ల‌కు కోపంతో ఊగిపోయిన మోనిత అక్క‌డి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది.

ఆ త‌రువాత కార్తీక్, దీప , సౌంద‌ర్య‌, ఆనంద‌రావు బ‌య‌టికి రావడంతో వారిని త‌న మాట‌ల‌తో రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది మోనిత‌. కార్తీక్ ఆగ్ర‌హంతో ఊగిపోతుందే సౌంద‌ర్య ఆపేస్తుంది. అది గ‌మ‌నించిన దీప .. మోనిత ద‌గ్గ‌రికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌బోగా.. వెంట‌నే సౌంద‌ర్య క‌ల‌గ‌జేసుకుని దీప‌ని ఆపుతుంది. క‌ట్ చేస్తే అంతా ఇంటికి వెళ‌తారు. ఇంటికి వ‌చ్చిన వారిని ఆదిత్య ప్ర‌శ్న‌ల‌తో ప్రోగ్రామ్ ఎలా జ‌రిగింద‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.

క‌ట్ చేస్తే మోనిత .. దీప మాట్లాడిన మాట‌లు త‌లుచుకుంటూ వుండ‌గా లాయ‌ర్ ఫోన్ చేస్తాడు. ఇక అన్ని ప‌నులు పూర్త‌యిన‌ట్టే అని చెప్ప‌డంతో మోనిత శుభ‌వార్త అంటూ పొంగిపోతోంది. ఆ త‌రువాత దీప‌తో కార్తీక్‌కు విడాకులు ఇప్పించాల‌ని సౌంద‌ర్య ఎందుకు అనుకుంది? .. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.