English | Telugu

రొమాన్స్ అనేది బేసిక్ నీడ్..అది అందరికీ అవసరం

రోటి, కపడా, రొమాన్స్ అనే మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఐతే దీనికి సంబంధించి మూవీలో మెయిన్ లీడ్స్ గా ఉన్న సుప్రాజ్ రంగా, మేఘలేఖతో ఆరియానా ఇంటర్వ్యూ చేసింది. అసలు ఈ టైటిల్ ఏమిటి అనేసరికి "మొదటి రెండు అందరికీ తెలుసు..ఐతే రొమాన్స్ అనేది ఈ మధ్య కాలంలో" అని సుప్రాజ్ అనబోతుంటే "తగ్గిందా తగ్గిందా" అంటూ గారంగా అడిగింది ఆరియానా. అందరికీ రోటి, కపడా, మకాన్ అనే తెలుసు కానీ రొమాన్స్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం ఎవరికీ తెలీదు కదా" అని సుప్రాజ్ అనేసరికి..రొమాన్స్ అనేది బేసిక్ నీడ్" అంటూ మేఘలేఖ కొత్త పాయింట్ చెప్పింది.

"ఈ మూవీకి ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి" అని మేఘలేఖను అడిగేసరికి "వేరే ఆప్షన్ లేక" అంటూ సుప్రాజ్ చెప్పాడు. "ఇంట్రావర్ట్స్ ఇష్టమా ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఇష్టమా" అని సుప్రాజ్ ని అడిగేసరికి "మాటలు రాని డంబ్ పీపుల్ అంటే ఇష్టం" అని చెప్పాడు. తర్వాత మేఘలేఖతో డంబ్ షో ఆడించింది ఆరియానా. అప్పుడు ఒక ప్రశ్నకు సుప్రాజ్ "ఎఫ్ టీవీ" అన్నాడు. "నాకు అర్ధమయ్యింది. రాత్రి అందరూ నిద్రపోయాక నువ్వు ఎఫ్ టీవీ చూస్తావు అని మాకు తెలిసిపోయింది" అని కామెడీ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.