English | Telugu

బేబీ బంప్ తో దేవర నటి...


టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర రాయ్. ఆమె ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో లేటెస్ట్ న్యూస్ ని అప్ డేట్ చేసింది. బేబీ బంప్ తో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. అలాగే "అనదర్ హార్ట్ బీట్" అంటూ చెప్పింది. చైత్రకి ఆల్రెడీ ఒక పాప ఉంది. ఆమె పేరు నిష్క శెట్టి. "బేబీ 2 ఈజ్ లోడింగ్. త్వరలో నిష్క శెట్టి అక్క కాబోతోంది. ఇప్పటి వరకు ఈ విషయాన్నీ మాలోనే దాచుకున్నాం. ఇక ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్ధించండి..ప్రేమ చూపించండి" అంటూ పోస్ట్ చేసింది. అలాగే వీళ్ళ ముగ్గురు ఉన్న ఒక అందమైన వీడియోని కూడా పోస్ట్ చేసింది.

దీంతో నెటిజన్స్, సెలబ్రిటీస్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు. చైత్ర రాయ్ దేవర మూవీలో నటించింది. అలాగే 2013 అష్టాచెమ్మా సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ లో స్వప్న అనే రోల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఆ తర్వాత అలా మొదలైంది, అత్తో అత్తమ్మ కూతురో, దటీజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, రాధకు నీవేరా ప్రాణం. వంటి సీరియల్స్ లో నటించింది. తెలుగుతో పాటు అటు కన్నడలో కూడా ఈమె బాగా ఫేమస్. రెండు ఇండస్ట్రీలోని సీరియల్స్ లో సినిమాల్లో నటిస్తుంది. ఈమె ఇంజినీర్ ప్రసన్న శెట్టిని వివాహం చేసుకుంది. చాల టీవీ షోస్ లో కనిపించేది. కానీ పెళ్లయ్యాక సీరియల్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇక దేవరతో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.