English | Telugu

జంబల్ హార్ట్ రాజా, భలే తమ్ముడు... సుమతో ఆడుకున్న బ్రహ్మానందం

ఈటీవీ 30 ఇయర్స్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇందులో అతిరథమహారధులందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక యాంకర్ గా సుమ అద్భుతంగా చేసింది. ఐతే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బ్రహ్మానందం, అలీ జోడి వచ్చారు. ఇక సుమ కూడా వాళ్ళను ఆట పట్టించింది. "ఆలీ గారు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రను ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ అడిగింది. "జంబల్ హార్ట్ రాజా" అని పేరు పెడితే బాగుంటుంది అంటూ ఆలీ చెప్పేసరికి బ్రహ్మానందం ఒక రేంజ్ లో లుక్ ఇచ్చారు.

ఇక సుమ ఐతే పడీపడీ నవ్వింది. "ఇది ఓకే అంటారా" అని బ్రహ్మానందాన్ని అడిగింది సుమ. " నా తమ్ముడు ఏది చెప్తే అదే" అన్నారు. "జంబల్ హార్ట్ రాజా" అర్ధం తెలీదు కానీ ఓకే సౌండింగ్ బానే ఉంది అన్నారు. "అలాగే ఆలీ గారు లైఫ్ హిస్టరీని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది" అంటూ సుమ బ్రహ్మానందాన్ని అడిగింది. "భలే తమ్ముడు" అని చెప్పారు. "చాల ఎమోషనల్ టచ్ ఇచ్చారు" అని సుమా అనేసరికి "ఊరుకో ఊరుకో నువ్వు అనవసరంగా కళ్ళ నీళ్లు పెట్టుకోవద్దు. ఏదో అన్నాను ఐపోయింది అంతే బాధపడకురా సుమా నువ్వూరుకో" అంటూ చెప్పేసరికి సుమ పగలబడి నవ్వేసింది. "30 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఏదన్నా మార్చుకోవాలనుకుంటున్నారా " అని సుమ అడిగేసరికి "ఎం ఎందుకు వెళ్ళాలి పనీ పాటా లేదా..ఏమన్నా పనుంటే చెప్పండి వెళ్తాం ..పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి..ఐనా 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే నేను ఎం మార్చుకోవాలనుకోవడం లేదు." అని చెప్పేసారు బ్రహ్మానందం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.