Read more!

English | Telugu

కావ్య వేసిన ముగ్గు‌‌ చూసి ఫిధా అయిన రాజ్.. తనని భార్యగా ఒప్పుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ‌గురువారం నాటి ఎపిసోడ్‌-45 లో.. దుగ్గిరాల ఇంటి కొత్త కోడలు కావ్య ఉదయమే ఇంటిముందు ముగ్గు వేస్తుంది. కావ్య ఇంటిలోకి వెళ్ళాక.. రాజ్ వాళ్ళ నానమ్మ, పనిమనిషి శాంతం వచ్చి ఆ ముగ్గుని చూస్తారు. ఏంటే శాంతా.. అప్పుడే అపర్ణ ముగ్గు వేసిందా అని అడుగుతుంది. లేదమ్మా.. ఈ ముగ్గు వేసింది ఈ ఇంటి కొత్త కోడలు కావ్యమ్మ గారు అని పనిమనిషి శాంతం చెప్తుంది. అది చూసి రాజ్ వాళ్ళ నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఏంటి ఆ అమ్మాయి వేసిందా.. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసే ఇల్లాలు ఇంటిని కూడా అంతే అందగా తీర్చిదిద్దుతుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది.

రాజ్ జాకింగ్ కి వెళ్ళి వస్తూ అక్కడ ఆగి వీళ్ళు మాట్లాడుకునేది అంతా వింటుంటాడు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళాక కావ్య వేసిన ముగ్గు చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ ముగ్గు ఒకవేళ మా అమ్మ చూస్తే ఇంప్రెస్ అవుతుందని రాజ్ అనుకొని ముగ్గుని తన కాళ్ళకున్న షూస్ తో చెరిపేసి లోపలికి వెళ్తాడు. అలా రాజ్ చెరపడం కావ్య  చూస్తుంది.  కోపం ఉన్నా కూడా ఒక్కమాట కూడా అనకుండా కావ్య లోపలికి వెళ్తుంది. పనిమనిషి శాంతం ఆ ముగ్గుని చూసి అది చెరిపేసినవాళ్ళని తిడుతుంది. అలా తిట్టడం చూసి రాజ్ కోప్పడుతాడు. ఆ తర్వాత రాజ్ ని ఫ్రెష్ అయి రమ్మని వాళ్ళ నానమ్మ చెప్తుంది. 

కాసేపటికి కళ్యాణ్, కావ్య దగ్గరికి వెళ్ళి నానమ్మ మిమ్మల్ని పిలుస్తుంది వదిన అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఈ రోజు నీకు కోడలిగా బాధ్యతలు అప్పగించాలి అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. అప్పుడే రెడీ అయి రాజ్ ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటాడు. నేను పూజలో పాల్లొనను అని రాజ్ చెప్తాడు. అది చూసి రాజ్ నానమ్మ.. "మన‌ ఆచారాలను, సంప్రదాయాలను ఇలా‌ వద్దు అనకూడదు" అని రాజ్ తో అంటుంది. సరేనని రాజ్ ఒప్పుకుంటాడు. అక్కడ పూలు, పండ్లు, చీర, అన్ని రకాలు కలిపి ఉన్న ప్లేట్ ని తన భార్య కావ్యకి ఇవ్వమని రాజ్ కి ఇస్తుంది రాజ్ వాళ్ళ నానమ్మ. అది తీసుకున్న రాజ్‌.. "తనని నా భార్యగా ఒప్పుకోను. ఇంట్లో పనివాళ్ళకి ఇస్తున్నానని అనుకుంటాను. పనివాళ్ళలో‌ ఒకరు పెరిగారని అనుకుంటాను" అని రాజ్ ఆ ప్లేట్ ని కావ్యకి ఇవ్వాలనుకుంటాడు. కావ్య వద్దంటుంది.

"నీ భర్త ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావమ్మా" అని కావ్యని వాళ్ళ చిన్న అత్తయ్య అపర్ణ అడుగుతుంది. "నన్ను భార్య అని ఒప్పుకొని‌ ఇవ్వమనండి.. ఆ రోజు కచ్చితంగా తీసుకుంటాను.‌ నేను బానిసని కాదు. నాకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటాయి కదా" అని కావ్య అంటుంది. అక్కడే ఉన్న రాజ్ వాళ్ళ అమ్మ.. "చూసారా అత్తయ్య ఎంత పొగరో.. మీ మాటకే ఎదురు సమాధానం చెప్తుంది. ఆత్మవిశ్వాసం అంటూ విప్లవ భావాలను వల్లె వేస్తుంది" అని రాజ్ వాళ్ళ నానమ్మతో అంటుంది. అది విని కావ్య.. నేను అలా అనలేదు అమ్మమ్మ గారు.. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. బానిసని కాదు అని అన్నాను. మీకు‌ ఎదురుతిరగలేదు. క్షమించండి అమ్మమ్మ గారు అని అంటుంది. ఆ తర్వాత రాజ్ చేతిలోని ప్లేట్ చిరాగ్గా విసిరేస్తాడు. అలా ప్లేట్ కిందపడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.