English | Telugu

Brahmamudi: రాహుల్ కన్నింగ్.. కావ్యకి రాజ్ ఆయుర్వేద చికిత్స చేపిస్తాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -891 లో....అప్పు, కళ్యాణ్ బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. గుడికి అని అప్పు చెప్తుంది. కళ్యాణ్ దగ్గరున్న బ్యాగ్ చూసి అదేంటని అడుగుతుంది. దాంతో ఇద్దరు కలిసి ఏదో ఒకటి కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. మేనేజర్ ఎక్కడ అని శృతిని రాజ్ అడుగుతాడు. అయన రిజైన్ చేసి రాహుల్ సర్ కంపెనీకి వెళ్ళిపోయాడని శృతి చెప్పగానే రాజ్, కావ్య షాక్ అవుతారు. ఒకసారి ఫోన్ చెయ్యండి అని కావ్య అనగానే వద్దులే.. ఇప్పుడు వాడి కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజర్ కావాలని రాజ్ అంటాడు.


మరొకవైపు రాహుల్ దగ్గరికి మేనేజర్ వస్తాడు. స్వరాజ్ కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళందరు మన కంపెనీకి రప్పించు అని రాహుల్ చెప్తాడు. దానికి అతను సరే అంటాడు. మరొకవైపు అప్పు డ్యూటీలో జాయిన్ అయ్యి చిన్న పాప కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. తనకన్నా పై ఆఫీసర్ ఎదురుపడి డ్యూటీలో జాయిన్ అయ్యావా అని అడుగుతాడు. మీరు అన్నారు కదా సర్.. నువ్వు ఖాళీగా ఉంటే కేసు ఇన్వెస్టిగేషన్ చెయ్యమన్నారు కదా అందుకే అని అప్పు అనగానే నేనేదో సరదాగా అన్నానని ఆఫీసర్ అంటాడు. నేను సీరియస్ గా తీసుకున్నా సర్ అని అప్పు అంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్య పాత ఫైల్స్ అన్నీ చెక్ చేస్తారు. ఆ తర్వాత అప్పు పాప వాళ్ళింటికి వెళ్లి అసలు ఏమైందో మొత్తం కనుక్కుంటుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. రాహుల్ వస్తాడు. రాజ్ మేనేజర్ గురించి అడగకముందే నేనే చెప్పాలని అనుకుంటాడు. మేనేజర్ నా కంపెనీకి వస్తానంటే నేను తీసుకున్నానని రాహుల్ చెప్తాడు. తరువాయి భాగంలో కావ్య కళ్ళు తిరిగిపడిపోతుంది. అక్కడ ఒక స్వామి చూసి ఇలాంటి సమస్యలకి ఒక దగ్గర ఆయుర్వేదంతో నయం చేస్తారని వాళ్లకు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.