English | Telugu

Brahmamudi : అబార్షన్ చేయాల్సిందేనన్న డాక్టర్.. రాజ్ ఒప్పుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -830 లో..... రాజ్ కి నిజం చెప్పానని అప్పుతో కళ్యాణ్ అంటాడు. అసలు చెప్పకుండా ఉండాల్సింది ఎలాగైనా బిడ్డని తల్లిని బ్రతికించుకుంటానని అన్నయ్య పట్టుదలగా ఉన్నాడని అప్పుతో కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి నిన్ను నా బిడ్డని ఎలాగైనా కాపాడుకుంటానని అంటాడు. వెళ్లిపోతున్న రాజ్ చెయ్ కావ్య పట్టుకొని మీరు ఎప్పుడు నాతో ఉండాలని అంటుంది.

మరుసటి రోజు స్వరాజ్ ని రెడీ చేసి రేవతి హాల్లోకి తీసుకొని వస్తుంది. అప్పుడే జగదీశ్ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. ఏంటి రావడానికి ఇబ్బంది పడుతున్నావని రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. అపర్ణ, సుభాష్ ఇద్దరు వెళ్లి పిల్వండి.. మీరే అప్పుడు రావద్దని అన్నారు కదా అందుకే ఇబ్బంది పడుతున్నాడని ఇందిరాదేవి అంటుంది. సుభాష్, అపర్ణ వెళ్లి జగదీష్ కి సారీ చెప్పి లోపలికి ఆహ్వానిస్తారు. నేనే మిమ్మల్ని బాధపెట్టానని జగదీష్ అంటాడు. ఆ తర్వాత ఇక మేమ్ వెళ్తామని రేవతి అంటుంది. అందరు ఇక్కడే ఉండాలని నిన్నే మీ అమ్మ చెప్పింది కదా అని ఇందిరాదేవి అంటుంది. ఇక్కడే అందరం ఉందామని అపర్ణ అంటుంది. లేదు అమ్మ కూతురు అత్తారింట్లో ఉండడమే గౌరవం నేను వస్తుంటానని రేవతి చెప్తుంది.

వెళ్తాను సర్ అని సుభాష్ కి జగదీశ్ చెప్తుంటే.. సర్ ఏంటి మావయ్య అనమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రేవతి అక్కడ నుండి వెళ్తుంది. మరొకవైపు ఇక ఇలా ఉంటే ఆస్తులు మనకి వచ్చేలా లేవు.. మంచివాడిలా మారినట్లు నటించాలి.. ముందు స్వప్నని నమ్మించాలని రుద్రాణితో రాహుల్ అనగానే తను సరే అంటుంది. తరువాయి భాగంలో రాజ్, కళ్యాణ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఖచ్చితంగా అబార్షన్ చెయ్యాలని డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత కంపెనీ నుండి కాల్ వచ్చింది ఆఫీస్ కి వెళ్ళమని రాజ్ తో సుభాష్ చెప్తాడు. నేను వెళ్ళనని తనపై రాజ్ చిరాకు పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.