English | Telugu

Brahmamudi : తల్లి కోసం రాజ్ భార్యని ఇంటికి తీసుకెళ్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -575 లో.. నా కూతురికి న్యాయం చెయ్యండి అని కనకం బాధపడుతుంటే రెండే రెండు రోజుల్లో న్యాయం చేస్తానని అపర్ణ అంటుంది.రాహుల్, రుద్రాణి ధాన్యలక్ష్మిలు భోజనం చేస్తుంటారు. మిగతా వాళ్లంతా హాల్లో కూర్చొని ఉంటారు. రాజ్ వచ్చి భోజనం చేద్దాం పదండీ అనగా.. మాకు ఆకలిగా లేదని వాళ్ళు అంటారు.

ఆ తర్వాత వాళ్లు కావ్యని తీసుకొని ఇంటికి వచ్చేవరకు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు రాజ్ అని రుద్రాణి అంటుంది. నువ్వు భోజనం చెయ్ అని రాజ్ ని అంటుంది రుద్రాణి. నేను చెయ్యనంటూ రాజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అపర్ణ ఇంట్లో కన్పించదు. ఆ విషయం రాజ్ కి తెలిసి కంగారు పడుతుంటాడు. భార్యని తరిమేశాడు.. ఇప్పుడు తల్లిని తరిమేశాడు.. ఇక మేమేనా అని రాజ్ పై కోప్పడతాడు సీతారామయ్య. మరొకవైపు అపర్ణ బ్యాగ్ తో కనకం ఇంటకి వెళ్తుంది. ఏంటి అత్తయ్య మీరు ఇలా వస్తే కుటుంబం పరువు గురించి ఆలోచించారా అని అపర్ణని కావ్య అడుగుతుంది. నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఇదంతా ఆలోచించావా అని అపర్ణ అంటుంది. మీ ఇష్టం అత్తయ్య అని కావ్య లోపలికి వెళ్తుంది. అపర్ణకి సపోర్ట్ గా కనకం ఉంటుంది

మరొకవైపు పనిమనిషి శాంత వచ్చి.. లెటర్ గదిలో దొరికింది అంటూ ఇస్తుంది. అందులో సుభాష్ ని ఉద్దేశించి ఉంటుంది. మీరు చేసిన తప్పుకి వెళ్లిపోతున్నా తప్పు అంటే మీ కొడుకుని అలా మొండిగా పెంచారని అపర్ణ రాసి పెడుతుంది. ఆ తర్వాత కనకంకి ఫోన్ చేస్తుంది స్వప్న. ఆంటి వచ్చిందా అని అనగానే.. వచ్చిందని కనకం అంటుంది. రాజ్ ఫోన్ తీసుకొని మమ్మీ ఇంటికి రా అంటాడు. నేను రానని చెప్పు కనకం.. తను ఇక్కడకి వచ్చి మాట్లాడమని కనకంతో అనడం రాజ్ వింటాడు. తరువాయి భాగంలో కనకం ఇంటికి రాజ్ వస్తాడు. తల్లిని భార్యని ఇంటికి తీసుకొని వెళ్తాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.