English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -555 లో....సీతారామయ్య కావ్యకి ఫోన్ చేసి.. రాజ్ ఏదో అంటున్నాడు కానీ వాడి మాటలు పట్టించుకోవడం లేదు కానీ నీకు జాగ్రత్త చెప్తున్నా.. ఆ అనామిక గురించి నీకు తెలుసు కదా అని నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసని సీతారామయ్య అనగా.. కావ్య సరే అంటుంది.

ఆ తర్వాత కనకం నేను కూడా వేళంపాటకి వస్తానని అనగానే.. సరేనని కావ్య అంటుంది. మరొకవైపు అసలు వేళంపాట గురించి ఏం తెలియదు ఎలా తెలుసుకోవాలి. ఈ కావ్య ఏం చెయ్యబోతుందన్న డౌట్ తో శృతి ని అడగాలని కాల్ చేస్తాడు. తను తిక్క సమాధానం చెప్తూ ఉంటే.. రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరుసటిరోజు ఉదయం అపర్ణ హాల్లో కూర్చొని ఉంటుంది. సుభాష్ ఇంకా లేవలేదా అని ఇందిరాదేవి అంటుంది. ఏమో నాకు తెలియదు మీరే వెళ్లి చూడండి అనగానే.. ఇందిరాదేవి వెళ్లేసరికి సుభాష్ జ్వరంతో ఉంటాడు. అది చూసి ఇందిరాదేవి వచ్చి.. భర్త అలా ఉంటే పట్టించుకోవడం లేదని కోప్పడుతుంది.

ఆ తర్వాత కావ్య, కనకం ఇద్దరు వేళంపాటకి వస్తారు. అనామిక వచ్చి కావ్యతో గొడవపడుతుంది. అప్పుడే రాజ్, రుద్రాణి ఇద్దరు కూడా వస్తారు. వేళంపాట మొదలవుతుంది. నేను వేళంపాట పడుతానని కనకం అనగనే.. కావ్య సరే అంటుంది. అనామికకి ఒక అమౌంట్ ఎక్కువనే కనకం పాడుతుంది. చివరగా అనామిక నలభై కోట్లకి పాడుతుంది. ఇక ఆపు అమ్మ అని కనకంతో కావ్య చెప్తుంది. అరవింద్ కంపెనీని అనామిక సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత అందరు బయటకు వస్తారు. అనామిక చూసావా.. నేనే దక్కించుకున్నా అన్నట్లు పొగరుగా మాట్లాడుతుంటే కాసేపు ఆగితే తెలుస్తుందని కావ్య అంటుంది. తరువాయి భాగంలో మావయ్యని క్షమించండి అప్పుడే మీ అబ్బాయి నన్ను క్షమిస్తాడని అపర్ణతో కావ్య అంటుంది. దాంతో సుభాష్ దగ్గరికి అపర్ణ వెళ్లి నన్ను క్షమించండి అని అంటుంది. వీళ్ళు ఒకటి అవ్వడానికి కారణం కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.