English | Telugu

అశ్వథ్థామ ఈజ్ బ్యాక్..ఎగ్జిట్ గేట్ దగ్గరికి ఇద్దరు

బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సోమవారం నామినేషన్ల ప్రోమో రానే వచ్చింది. ప్రేక్షకులలో ఇంకాస్త ఉత్కంఠని రెకేత్తించడానికి బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రోమోని వదిలాడు. ఇక అది ఈ సీజన్ లోనే నెక్స్ట్ లెవల్ నామినేషన్ అని చెప్పొచ్చు.

నామినేషన్ లో రోహిణిని పృథ్వీ ఒక బ్యాడ్ వర్డ్ వాడారంటూ నామినేట్ చేశాడు. నెక్ ఫాంటసీ అనేది బ్యాడ్ వర్డ్ అనే విషయం నాకు తెలియదని రోహిణి వివరణ ఇస్తుంది. ఆ తర్వాత ప్రేరణ, హరితేజ మధ్య తగ్గ ఫర్ వార్ నడిచింది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని హరితేజ అనగానే.. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫేక్ అన్నాను.. రికార్డింగ్ తెచ్చి చూపించండని ప్రేరణ అంటుంది. అలా ఎలా మాట మారుస్తావ్.. అయ్యో దేవుడా అంటూ హరితేజ సాగదీస్తుంది. ఆ తర్వాత ఎవడు నన్ను ఏమన్న నాకు భయం లేదు.. ఏం లేదు.. ఇప్పటి నుండి అన్నీ తీసేస్తున్నాను.. అశ్వథ్థామ ఈజ్ బ్యాక్ అని గౌతమ్ గట్టిగా అరుస్తాడు. సరే నువ్వు బయటకు వెళ్ళడానికి రెడీ ఆ చూసుకుందామని నిఖిల్ అనగానే.. పదా చూసుకుందామంటూ గౌతమ్, నిఖిల్ ఇద్దరు బిగ్ బాస్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్తారు.

అదంతా చూస్తున్న మిగతా హౌస్ మేట్స్ షాక్ అవుతారు. ఇలా మాటి మాటికీ గేట్ దగ్గరికి వస్తే బిగ్ బాస్ ఓపెన్ చేస్తే వాళ్ళ పరిస్థితేంటి.. ఒకసారి గేట్ ఓపెన్ చేసి ఇక వెళ్ళండి అంటే దూల తీరుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రోమోనే ఈ లెవల్ లో ఉందంటే పూర్తి ఎపిసోడ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.