English | Telugu

Srija Dammu Remuneration: శ్రీజ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


బిగ్ బాస్ సీజన్-9 లో కథ మారింది.. కంటెస్టెంట్స్ మారారు. నిన్న మొన్నటి దాకా శ్రీజని వాగుడు కాయ్, ఎలిమినేషన్ చేయాలని అనుకున్న బిబి ఆడియన్స్ .. నేటి తన ఎలిమినేషన్ చూసి అన్ ఫెయిర్ అని అంటున్నారు. ‌

హౌస్ లో ప్రతీ గేమ్ దమ్ముగా ఆడిన శ్రీజ.. అయిదో వారం సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్స్ డెసిషన్ వల్ల తను ఎలిమినేషన్ అవ్వడం కాస్త అన్ ఫెయిర్ గా అనిపించింది. ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని.. చివర్లో మనిద్దర్లో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది శ్రీజ.. అలా పవన్.. తనూజతో, సుమన్ శెట్టితో జత కట్టింది. నిన్న మొన్నటి వరకు జరిగిన గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్- తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ-సుమన్ డేంజర్ జోన్లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్కు కలిసొచ్చింది కానీ శ్రీజ చిక్కులో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచలా ఆటలో నుంచి తీసేశారు.

బిగ్ బాస్ సీజన్-9 లోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన శ్రీజకు ఎదురుదెబ్బ తగిలింది. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి అరవై నుండి డెబ్బై వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట. దీని ప్రకారం అయిదు వారాలకు గానూ మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మేర పారితోషికం అదుకున్నట్లు తెలుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.