English | Telugu

బేబీ సినిమాలో సీత...బూతులతోనే ఫేమస్

బిగ్ బాస్ సీజన్ 8 ఏడు జంటలు, పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. అయితే ఇందులో ఎవరు ఎంటనేది టీవీలో చూసిన ప్రేక్షకులకి అర్థమవుతుంది. శేఖర్ భాషా, బెజవాడ బేబక్క, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, సీరియల్ యాక్టర్ నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీరాజ్, కిరాక్ సీత, సబీల్ ఆఫ్రిదీ, నాగ మణికంట, నైనిత, విష్ణుప్రియ, సోనియా, ఆదిత్య ఓమ్ బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ లో హౌస్ లోకి వెళ్ళారు.

ఇక హౌస్ లోకి వెళ్ళిన వారి ఒక్కొక్కరి ఏవీలో చాలా డెప్త్ ఉంది. అయితే వారిలో కిర్రాక్ సీత ఏవీ ఇంప్రెసివ్ గా ఉంది. కిర్రాక్ సీత అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ 7 ఆర్ట్స్ సీత, బేబీ సినిమాలో సీత అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు.రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్‌ షిఫ్ట్ అయింది.ఆమె తండ్రి దూరదర్శన్‌లో పనిచేసేవారు. ఇక నటనపై ఇంట్రెస్ట్‌తో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేసింది సీత. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో చివరికి 7 ఆర్ట్స్‌లో పని చేసింది. 7 ఆర్ట్స్ అంటేనే బోల్డ్ కంటెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో 7 ఆర్ట్స్ సరయు కూడా బిగ్‌బాస్‌లో సందడి చేసింది.7 ఆర్ట్స్‌లో చాలా కాలం పని చేసిన తర్వాత సీతకి బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఈమెకి బ్రేక్ వచ్చింది.

ఇక పలు ఇంటర్వ్యూల్లో తన గురించి పలు విషయాలు పంచుకుంది సీత. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఐదేళ్లు ఓ అబ్బాయితో రిలేషనల్‌లో ఉన్నానని కానీ బ్రేకప్ అయిపోయిందంటూ కూడా చెప్పింది. సీతకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సినిమాల్లోకి రావడం కోసం ట్రై చేయడానికి ఇంట్లో వాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన ఖర్చు మొత్తం తనే సంపాదించుకొని, చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది సీత. మరి బిగ్‌బాస్‌లో ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.