English | Telugu

బిగ్ బాస్ 6 అప్డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జునే కానీ?

తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ఇటీవలే ఘనంగా ముగిసిన ఐదో సీజన్ లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే మరో రెండు నెలల్లో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుందని బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ అప్డేట్ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ షో ఓటీటీలో అలరించనుంది.

ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీలో ఒక సీజన్ పూర్తి చేసుకుంది. దీనికి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా బిగ్ బాస్ ఓటీటీలో అలరించనుంది. బిగ్ బాస్ లైవ్.. ఓటీటీలో మొదటిసారిగా ప్రసారం కాబోతోంది. దీనికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రోజంతా ఉన్నా అక్కడా జరిగే కొన్ని హైలైట్స్ ని మాత్రమే ఎడిట్ చేసి ఎపిసోడ్ గా ఆడియన్స్ కి చూపిస్తారు. అయితే ఓటీటీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ లైవ్ లో మాత్రం కంటెస్టెంట్స్ హౌస్ లో డే అంతా ఎలా ఉంటున్నారో చూపించనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ లైవ్ తో పాటు పలు సిరీస్ లు, ఓటీటీ సినిమాలతో అలరించడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధమవుతోంది. తెలుగులో రాబోతోన్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ 'పరంపర'తో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతన్నారు. క్రిష్ డైరెక్షన్‌లో తారక రత్న, అజయ్ కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ '9 అవర్స్' అనే చిత్రం రాబోతోంది. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో సైతాన్ అనే హారర్ సినిమా రెడీగా ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.