English | Telugu

Bigg boss 9 Telugu : శ్రష్టి వర్మకి బిగ్ బాస్ నుండి వచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే!

బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్ శ్రష్టి వర్మ. అందరు ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. హౌస్ ప్రతీ సీజన్ లో ఒక కొరియోగ్రాఫర్ ఉండడం అనేది కంపల్సరీ. అయితే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఇంత త్వరగా హౌస్ నుండి బయటకు వస్తుందని ఎవరు ఉహించలేదు. హౌస్ లో కూడా అందరు సుమన్ శెట్టి లేదా ఫ్లోరా సైనీ వెళ్తుందని భావించారు.

బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ లాంఛ్ రోజున శ్రష్టి వర్మ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాగార్జున తనని అడిగాడు. నువ్వు త్వరగా హౌస్ నుండి బయటకు వస్తే నా నెక్స్ట్ సినిమాకి కొరియోగ్రఫి చేద్దువు గానీ అని అడిగాడు. అయ్యో తప్పకుండా సర్.. నేను అదే అనుకుంటున్నానని శ్రష్టి వర్మ అంది. హౌస్ నుండి త్వరగా వస్తావా అని నాగార్జున అన్నది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏదో సరదాగా అంటే సీరియస్ గా తీసుకున్నట్లుందని నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్-9 లో శ్రష్టి వారం రోజులు ఉంది. ఇందుకు గాను తనకి వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ కంటెస్టెంట్ కి ఎలాగూ వారం ఉంటారు కాబట్టి అందరికి వారం రెమ్యునరేషన్ అడ్వాన్స్ లాగా ఇస్తారు. అయితే శ్రష్టి కి ముందే వారం రోజుల పేమెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు హౌస్ నుండి ఖాళీ చేతులతో పంపించారన్నమాట. హౌస్ లో తన ఆటతీరు ఎలా ఉంది.. ఏం చేస్తే తను హౌస్ లో ఉండేదో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.