English | Telugu

Bigg Boss 9 Telugu : డీమాన్ తో ఫేక్ బాండ్ పెట్టుకున్నావ్.. రీతూపై మాధురి ఫైర్!

బిగ్ బాస్ సీజన్-9 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఎనిమిదో వారం నామినేషన్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో నామినేషన్లు ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ తో జరిగాయి. రీతూని మాధురి నామినేట్ చేస్తుంది. నువ్వు మా టీమ్ లో ఉన్నావ్.. నిన్ను నమ్మొద్దని అందరు చెప్పారు కానీ నేను నమ్మినా.. మళ్ళీ టీమ్ నుండి వెళ్లిపోయావ్.. అంతేకాకుండా డీమాన్ కి డబ్బు ఇవ్వలేదు. డీమాన్ సపోర్ట్ లేకుండా అసలు ఒక్క గేమ్ అయినా ఆడావా అని మాధురి అడుగగా.. ఏ గేమ్ ఆడలేదు.. ఏ గేమ్ అయినా, నేను సింగిల్ గానే ఆడానని రీతూ చెప్పింది.

ఒక బాండ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నావని మాధురి అనగానే ఇక్కడ ఎవరికి లేవు బాండ్స్.. ఒక్క మా బాండ్ నే కన్పిస్తుందా అని రీతూ అంటుంది. మీ బాండ్ ఫేక్.. అన్ హెల్తీ బాండ్ అని మాధురి అంటుంది. మీది ఫేక్ బాండ్ మీకు తనూజకి ఒక బాండ్ ఏర్పడింది కదా అని రీతూ మాట్లాడుతుంది. నీ వల్ల పాపం మంచి కంటెస్టెంట్ అయిన డీమాన్ పవన్ గేమ్ కూడా చెడగొడుతున్నావని మాధురి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.. ఒకరికి ఒకరి ఇద్దరు మీద మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటారు. . ఒక నిమిషం వీళ్ళు కొట్టుకుంటారా అనిపించింది.. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారని మాధురి అంటుంది.

అసలు మిమ్మల్ని చూస్తేనే చిరాకులాగా ఉంటుంది. ఎప్పుడు ఇద్దరు పక్కపక్కనే ఉంటారని మాధురి అనగానే.. ఉంటాం నీకేంటి.. హౌస్ లోకి గేమ్ ఆడడానికి వచ్చావా మమ్మల్ని చూడడానికి వచ్చావా అని రీతూ అంటుంది. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. వీకెండ్ లో నాగార్జున వీరిద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకుంటాడనిపిస్తుంది. మరి వీరిద్దరి గొడవ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.