English | Telugu

కాజ‌ల్ పారితోషికం ఎంతో తెలుసా?

బిగ్‌బాస్ ఫైన‌ల్ అంకానికి చేరింది. ఈ షో ముగియ‌డానికి మ‌రో వార‌మే మిగిలి వుంది. దీంతో చివ‌రి వారం అంటే ఈ ఆదివారం ఆర్జే కాజ‌ల్ హౌస్ పుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేప‌థ్యంలో ఆమె రెమ్మున‌రేష‌న్ పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. హైస్‌లో మొద‌టి నుంచి ఇంటి స‌భ్యుల కార‌ణంగా అవ‌మానాలు, చీత్కారాలు ఎదుర్కొంటూ వ‌చ్చింది కాజ‌ల్‌. బిగ్‌బాస్ త‌న డ్రీమ్ అని చెప్పుకుంటూ వ‌చ్చింది.. అయినా ఆమెని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

బిగ్‌బాస్ బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి

గొడ‌వ‌ల మారి అని.. త‌ను హౌస్ నుంచి బ‌య‌టికి వెళితేనే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని కార‌ణం చెబుతూ ష‌న్ను డైరెక్ట్‌గా నామినేట్ చేయ‌డం ప‌లువురిని షాక్ కి గురిచేసింది. అయినా స‌రే మొండి ప‌ట్టుద‌ల‌తో తాన స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళుతూ చివ‌రి వారం వ‌ర‌కూ గ‌ట్టి పోటీనిస్తూ వ‌చ్చింది. ఎవ‌రు ఎన్నిర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసినా తాను ఎక్క‌డా త‌గ్గేది లేదు అంటూ మొండిగానే ముందుకు సాగింది. 14 వారాల పాటు గ‌ట్టి పోటీనిస్తూ నిల‌బ‌డి చివ‌రికి ఈ ఆదివారంఎలిమినేట్ అయింది.

అయితే ఈ 14 వారాల‌కు గానూ కాజ‌ల్ కి ఎంత రెమ్యున‌రేష‌న్ అందింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హౌస్ లోకి వ‌చ్చే ముందు వారానికి కాజ‌ల్ కి 2 ల‌క్ష‌లు పారితోషికంగా ఫిక్స్ చేశార‌ట‌. అంటే 14 వారాల‌కు ఆమెకు పారితోషికంగా 30 ల‌క్ష‌లు అందిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం అప్పు త‌న‌కు వుంద‌ని ముందే చెప్పిన కాజ‌ల్ ఆ మొత్తంలో త‌న అప్పుని తీర్చుకుంటుంద‌ని చెబుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.