English | Telugu

'ఏం త‌న్నాల‌ని వుందా?'.. 'త‌న్ను మ‌రి'.. సిరి విష‌యంలో స‌న్నీ-ష‌ణ్ణు కొట్లాట‌!

బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు మ‌రో తీవ్ర‌మైన గొడ‌వ‌ను చూడ‌బోతున్నాం. సిరిని అప్ప‌డ‌మైపోతావ్ అని హెచ్చ‌రించిన స‌న్నీతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడ‌మంటూ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ అన్నాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయాడు స‌న్నీ. కెప్టెన్సీ కోసం పోటీప‌డేవాళ్ల‌కు 'ట‌వ‌ర్‌లో ఉంది ప‌వ‌ర్' అనే టాస్క్‌ను ఇస్తున్న‌ట్లు బిగ్ బాస్ ప్ర‌క‌టించాడు. అందులో విజ‌యం సాధించిన వారు ఈవారం కెప్టెన్ కానున్నారు.

టాస్క్‌లో కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీప‌డుతున్న‌ప్పుడు స‌న్నీని క‌ద‌ల‌కుండా గ‌ట్టిగా ప‌ట్టుకుంది సిరి. దాంతో "ప్రొటెక్ట్ చేసేవాళ్ల‌ను ప‌ట్టుకోవాలి. ఆట‌లో ఉన్న‌వాళ్ల‌ను ప‌ట్టుకోవ‌డం మేంటి?" అని ప్ర‌శ్నించాడు స‌న్నీ. "ఇది నా స్ట్రాట‌జీరా" అని జ‌వాబిచ్చింది సిరి. "గేమ్ ఆడితే వ‌చ్చి తంతా" అన్నాడు కోపంగా స‌న్నీ. "అబ్బా.." అని వ్యంగ్యంగా ఏదో అంది సిరి. "అప్ప‌డ‌మ‌యితావ్‌.. తెలుసుగా" అన్నాడు స‌న్నీ. "అయితే వెళ్లి అమ్ముకో అప్ప‌డాలు" అంటూ గెంతులు వేసింది సిరి. "అప్ప‌డ‌మైతే నిన్నే అమ్మేది" అని స‌న్నీ అంటుంటే.. మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకున్నాడు ష‌ణ్ముఖ్‌.

"త‌నేమీ అన‌లేదు క‌దా" అని అత‌డికి న‌చ్చ‌చెప్ప‌బోయాడు షణ్ణు. "ఏయ్ నువ్వాగు.." అంటూ ఆవేశంగా అత‌ని మీద‌కు వ‌చ్చాడు స‌న్నీ. "నువ్వు త‌న్న‌లేవ్" అన్నాడు ష‌ణ్ణు. "ఏం త‌న్నాల‌ని ఉందా?" అన్నాడు స‌న్నీ. "త‌న్ను మ‌రి" అని రెట్టించాడు ష‌ణ్ణు. "ద‌మ్ముంటే ఫైట్ చేసుకుందాంరా. ఆడ‌పిల్ల‌ను పంపించి మాట్లాడ్డం కాదు" అన్నాడు స‌న్నీ. రెస్పెక్ట్‌తో మాట్లాడ‌మ‌న్నాడు ష‌ణ్ణు. "నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది" అన్నాడు స‌న్నీ. ష‌ణ్ణును డిఫెండ్ చేస్తూ స‌న్నీపై సిరి ఫైర్ అవ‌గా, స‌న్నీని ఆప‌డానికి ప్రియాంక ప్ర‌య‌త్నించింది. వీళ్ల గొడ‌వ ఎంత దాకా వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.