English | Telugu

నీతోనే నా నెక్స్ట్ బైక్ ట్రిప్... నిన్ను ప్రపంచానికి చూపిస్తాను!

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హైదరాబాద్ నుంచి ప్రసన్న కుమార్ అనే ఒక ఫిజికల్లీ ఛాలెంజెడ్ వ్యక్తి వచ్చారు. ఐఐఎం పని చేశారు అలాగే వీడియోగ్రాఫర్ గా, వీడియో ఎడిటర్ గా వర్క్ చేసినట్లు చెప్పారు. అలాగే ట్రావెలర్, బైక్ రైడర్, మోటార్ సైకిల్ రైడర్, 21 కిలోమీటర్స్ బ్లేడ్ మారథాన్ రన్నర్ అని చెప్పారు. బ్లేడ్ మారథాన్ అంటే అని నవదీప్ అడిగాడు. నిజానికి నేను ఫిజికల్లీ ఛాలెంజెడ్ అంటూ ఒక కాలిని చూపిస్తూ తన కథను చెప్పుకొచ్చారు. "ఒక వారంలో నేను న్యూజిలాండ్ కి వెళ్లిపోవాల్సి ఉంది. ఆ టైములో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ చేసుకుని డిన్నర్ చేసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది." అని చెప్పారు. "ఐనా కానీ అది ఎక్కడా మిమ్మల్ని ఆపినట్టుగా లేదుగా" అన్నాడు నవదీప్. "లేదుసార్.. నాకు యాక్సిడెంట్ అయ్యాక మాత్రమే ఇవన్నీ నేను సాధించగలిగాను. నా లైఫ్ చాలా నార్మల్ గా ఉండేది. నేను జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్ ని కూడా. హార్స్ రైడింగ్ కూడా చేస్తాను" అని చెప్పారు. దాంతో శ్రీముఖి ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్సా అంది. జడ్జెస్ కూడా ఫుల్ ఇంప్రెస్ ఇపోయారు. "నేను పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక కోమాలో ఉన్నట్టుగా ఉండేవాడిని. బాబాయ్ ఉన్నాడు ఆయనే నన్ను మోటివేట్ చేసాడు. 65 కేజీలు ఉండాల్సిన వాడిని 40 కేజీలకు వచ్చేసాను. ఎందుకు జిమ్ కి వెళ్లి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోకూడదు అన్నాడు.

మా తాత నాకు అన్నీ చూసుకునేవాడు. ఈ వయసులో ఆయన్ని నేను చూసుకోవాలి కానీ నన్ను ఆయన చూసుకుంటున్నారు. నా పెళ్లి బిడ్డ ఉంటే నేను నా జీవితంలో సక్సెస్ అయ్యి ఉండాలి అనుకున్నా. మీ డాడీ ఇది అని నన్ను పాయింట్ అవుట్ చేయకూడదు అనుకున్న. ప్రోస్తెటిక్ లెగ్ పెట్టాక నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. వాళ్ళను చూసి నవ్వుతూనే ఉన్న. మారథాన్ కి వెళ్తానంటే మా నాన్న వద్దన్నారు. డాక్టర్ ఆయన్ని కన్విన్స్ చేశారు. అలా నేను ఆ రోజు నుంచి ఇంకా ఎక్కడా ఆగలేదు" అని చెప్పాడు. "మీరు ఏ జిమ్ కి వెళ్తారండి చెప్పండి. నేను మిమ్మల్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతాను" అంటూ అభిజిత్ అడిగాడు. "మీ ఇద్దరి ట్రావెలింగ్ వీడియోస్ చూసినప్పుడు ఏదో ఒకరోజు మీతో కలిసి ట్రావెల్ చేద్దాం" అనుకునేవాడిని అని చెప్పాడు. దాంతో వెంటనే నవదీప్ "బ్రో నా నెక్స్ట్ బైక్ ట్రిప్ లో నువ్వు నాతో వస్తున్నావ్..నీ కథను ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు..నిన్ను హౌస్ లో చూడాలని ఉంది" అని చెప్పాడు. ఇక ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చేసారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.