English | Telugu
బిగ్‌బాస్ ఓటీటీ ఎలిమినేషన్ స్టార్ట్!
Updated : Mar 4, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ ఇటీవల ఫిబ్రవరి 26న అట్టహాసంగా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ అంటూ హడావిడి చేశారు. కానీ ఆదిలోనే దీనికి ఆటంకాలు మొదలయ్యాయి. బుధవారం అర్థ్రరాత్రి లైవ్ స్ట్రీమింగ్ ని నిలిపివేస్తూ వీక్షకులకు షాకిచ్చింది. సాంకేతిక లోపాల కారణంగానే స్ట్రీమింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పిన నిర్వాహకులు మొత్తానికి గురువారం రాత్రి 9 గంటల నుంచి మళ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే షోలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ హౌస్ లో రచ్చ మొదలుపెట్టారు.
వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. అల్లరి, ఏడుపులు, గొడవలు..అలకలు వెరసి బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్ గోల గోలగా సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి వచ్చారు. ఇందులో మాజీలు, కొత్త వారూ వున్నారు. ఇటీవలే నామినేషన్ మొదలైంది. సీనియర్ లని జూనియర్ లు ఎక్కడా వదలడం లేదు. రక రకాల కారణాలు చెప్పి సీనియర్ లని కూడా నామినేట్ చేసేశారు. ఈ వారం వారియర్స్ టీమ్ నుంచి సరయు, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరి, హమీదా, ముమైత్ ఖాన్.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి మిత్రశర్మ ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు.
Also Read:`ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. డీఎస్పీ మార్చి సెంటిమెంట్!
ఇలా నామినేట్ అయిన వారిలో అరియానా, హమీదాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దీంతో వీరు సేఫ్ అయినట్టే. ఆర్జే చైతూ కు యాంకర్ శ్రీముఖి, ఆర్జే కాజల్ ల అండ వుంది దీంతో ఇతనూ సేఫేనట. ఇక ముమైత్‌ఖాన్ గురించి చెప్పనక్కర్లేదు తనకూ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది కాబట్టి తనని వారు కాపాడేస్తారు.. దీంతో తను కూడా సేఫే. ఎటొచ్చీ నటరాజ్ మాస్టర్, సరయు, మిత్రశర్మలకు రిస్కు ఎక్కువ. అయితే ఈ ముగ్గురిలో నటరాజ్ మాస్టర్ హౌస్ లో వుండాలని, తను వుంటేనే గొడవలు, హంగామా వుంటుందని భావించే వాళ్లు వున్నారు.
వారి వల్ల నటరాజ్ మాస్టర్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సరయు సీజన్ 5లో ఫస్ట్ వీక్ లోనే ఇంటిదారి పట్టింది. ఈ సారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే ఆమె సేఫ్.. మిత్రశర్మ గురించి ఎవరీకీ తెలియదు. తమిళ నటి .. ఆమె వుండటం కష్టమే.