English | Telugu

Bigg Boss 9 Telugu : శ్రీముఖికి ఎల్లో కార్డ్.. ఓట్ అప్పీల్ సాధించిన ప్రియ!

బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభానికి ముందే పీక్స్ కి వెళ్తుంది. అగ్నిపరీక్షలో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెవెల్ లో సాగుతుంది. తాజాగా జడ్జెస్ కోపంగా ఉన్నారని కంటెస్టెంట్స్ తో ప్రామిస్ చేయించింది శ్రీముఖి. ఇక జడ్జెస్ కోపంగానే స్టేజ్ మీదకి ఈ ఒక్క ఛాన్స్ ఇస్తామన్నట్లు కోపంగా మాట్లాడి వాళ్ళ సీట్లలోకి వెళ్తారు. ఇక పదిహేను మంది ముగ్గురుగా అయిదు టీమ్ లు అయ్యారు. టీమ్ కి ఒక లీడర్ ఇక నిన్న జరిగిన టాస్క్.. రియల్ ఆర్ ఫేక్.

ఈ కాన్సెప్ట్ లో కొన్ని వస్తువులు కంటెస్టెంట్స్ ముందు పెట్టారు. అలాగే మనుషులని నిల్చోబెట్టారు. రెండు కేక్ లని పెట్టి ఏది రియల్ ఏది ఫేక్ అని కనుక్కోమన్నారు. అయితే అక్కడున్నవారిని ఒక్కో క్వశ్చన్ అడుగగా టీమ్ కి ఒకరు వచ్చి తమ సమాధానం పేపర్ పై రాసారు. అందరు రియల్ కేక్ ని ఫేక్ అని ఫేక్ కేక్ ని రియల్ అని పెట్టారు. ఇక తర్వాత ఆ కాన్సెప్ట్ లో రియల్ జుట్టు, ఫేక్ జుట్టు ఎవరిది అని అడుగగా అందరు రాంగ్ చెప్పారు. ఇలా ప్రతీ ప్రశ్నకి అందరు రాంగ్ చెప్పారు. కొన్ని క్వశ్చన్స్ కి కొన్ని టీమ్ లు కరెక్ట గా చెప్పారు. అసలు మీరు క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడం లేదా మేము సరిగా చెప్పాడం లేదా అని నవదీప్, అభిజిత్ కంటెస్టెంట్స్ పై కోప్పడ్డాడు.

ఏది రియల్ ఏది ఫేక్ అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా అని కంటెస్టెంట్స్ పై జడ్జులు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. ఎల్లో కార్డు ఎవరికి ఇస్తారని శ్రీముఖి అడుగగా నీకు ఇస్తాను. వాళ్ళు ఇప్పుడు బాగా ఆడుతారని తీసుకొని వచ్చావ్ ఏమైందని శ్రీముఖిపై నవదీప్ కోప్పడతాడు. అసలు క్వశ్చన్ నే వినకుండా ఆన్సర్ చేసిన దాలియా కి ఎల్లో కార్డ్ ఇచ్చాడు నవదీప్. ఇక స్టార్ ఇవ్వలేదు.. గుడ్డిలో మెల్లి బెస్ట్ కాబట్టి ప్రియకి ఇస్తున్నామని జడ్జెస్ డిసైడ్ అయి ప్రియకి ఇస్తారు. ప్రియ అగ్నిపరీక్షలో ఓట్ అప్పీల్ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఓటు అప్పీల్ చేసుకుంది. తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో అయిన కంటెస్టెంట్స్ జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తారో లేదో చూడాలి‌ మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.