English | Telugu

పెళ్ళాం చెబితే వినాలి..

చాలా కుటుంబాల్లో భార్యభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ సలహాలు ఇచ్చుకోరు. అందులోనూ భార్యల మాటల్ని కానీ సలహాలను కానీ భర్తలు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఒకరి సలహాలు మరొకరు విని ఆచితూచి అడుగు వేస్తారో వాళ్ళు లైఫ్ లో పెద్దగా నష్టపోరు...ఇప్పుడు ఆది రెడ్డి కూడా అదే చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పుడు ఆది రెడ్డికి, నా అన్వేషణకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ టైములో ఆది ఈ వీడియోని పోస్ట్ చేసాడు.

"నా పెళ్ళై ఐదేళ్లు అయ్యింది. ఈ టైంలో ఆది ఇది చేయొద్దు...నీకు నెగటివ్ అవ్వొచ్చు..లాస్ రావొచ్చు...అని చెప్పేది. కానీ నేను ఆమె మాట వినలేదు. దాంతో లాస్ వచ్చింది. దాంతో నేను కొన్ని నెలల క్రితం నేను ఒకటి డిసైడ్ అయ్యాను. భార్య మాట వినాలి ఎందుకంటే మనం టెన్షన్స్ లో డెసిషన్స్ తీసేసుకుంటాం కానీ భార్య మాత్రం భర్త చెడును కోరుకోదు. అందుకే ఆలోచించి భర్త బాగుండాలని కోరుకుంటూ సలహాలు ఇస్తే మనం మాత్రం అన్నీ మనకే తెలుసులే అని లైట్ తీసుకుంటాం. ఆ తరువాత దెబ్బ పడినప్పుడు, లాస్ వచ్చినప్పుడు, నెగటివ్ ఐనప్పుడు అర్ధమవుతుంది. కాబట్టి భార్యల మాటలు వింటే కచ్చితంగా మంచే జరుగుద్ది..అలాగే నా వైఫ్ చెప్పింది ఒక్కటే ఎవరో ఏదో అన్నారని రియాక్ట్ అవ్వొద్దు...ఏదైనా ఉంటే లీగల్ గా వెళ్ళు అని చెప్పింది ఇప్పుడు అదే చేస్తున్నా. నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన యాప్స్ ని, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు ..ఇక ముందు కూడా చేయను." అని చెప్పాడు ఆది రెడ్డి.

అలాగే టెలిగ్రామ్ యాప్ లో తన పేరుతో బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని దానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు ఆది రెడ్డి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.