English | Telugu

Bigg Boss 9 Telugu voting 13th week: పదమూడో వారం డేంజర్ జోన్ లో‌ ఆ ఇద్దరు.. టఫ్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం నామినేషన్లో‌ ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కళ్యాణ్ మినహా అందరు నామినేషన్లో ఉన్నారు. ఇక శుక్రవారం అర్థరాత్రి వరకు సాగే ఈ ఓటింగ్ లో నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ బట్టి ఎవరు టాప్ లో ఉన్నారో.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

తనూజ టాప్ ఓటింగ్ తో దూసుకెళ్తోంది. 28.24 శాతం ఓటింగ్ తో తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 15.4 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ రెండో స్థానంలో ఉన్నాడు. 15.14 శాతం ఓటింగ్ తో భరణి మూడో స్థానంలో ఉన్నాడు. 14.16 శాతం ఓటింగ్ తో రీతూ చౌదరి నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఇద్దరు 13 శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం సంజన ఎలిమినేట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు సంజన, సుమన్ శెట్డిలకే బిగ్ బాస్ ఫుల్ సపోర్ట్ ఉంది. పన్నెండు వారాలుగా హౌస్ లో వీళ్ళిద్దరు ఏ గేమ్ ఆడకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా తనని హౌస్ లో ఉంచుతూ వచ్చాడు బిగ్ బాస్. అయితే సంజన, సుమన్ శెట్టిలు హౌస్ లో ఉండటం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి డీమాన్ పవన్ కి అన్యాయం జరుగుతుంది.

ప్రతీసారీ టాస్క్ లో బెస్ట్ ఇచ్చే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. ‌ఎందుకంటే హౌస్ లో ఎంత పర్ఫామెన్స్ ఇచ్చినా ఓటింగ్ లో సుమన్ శెట్టి, సంజన ఉంటే మెజారిటీ ఓటింగ్ వారిద్దరికే పడుతోంది. అయితే ఈ వారం వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారు. ఒకవేళ వీరిద్దరిని కాకుండా రీతూని ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంది. మరి నామినేషన్లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.