English | Telugu

Bigg boss 9 Telugu :ఇమ్మాన్యుయల్ కి వచ్చిన ఫ్యామిలీ ఫోటో.. బ్యాటరీ తగ్గిందిగా!

బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం లో ఫ్యామిలీ నుండి సర్ ప్రైజెస్ ని కంటెస్టెంట్స్ కి ఇవ్వాలని బిగ్ బాస్ ప్లాన్ చేసాడు. అలా రాగానే ఇలా ఉరికినా బిగ్ బాస్ ఇవ్వడు కదా.. ఒక టాస్క్ పెట్టాడు.. ఒక ఆపిల్స్ చెట్టుకి ఉంటాయి. అయితే అవి కంటెస్టెంట్స్ ఫోటో గల ఆపిల్స్.. ఎవరి పేరుతో ఉన్న ఆపిల్ వారిని తీసుకోమంటాడు. అది ఓపెన్ చేస్తే అందులో ఒక గింజ ఉంటుంది.

ఆ గింజ అందరికి డిఫరెంట్ గా వస్తుంది. కొందరికి రెడ్.. మరికొందరికి బ్లూ.. ఇంకొకదరికి బ్లాక్.. ప్రియ, శ్రీజ, రీతూ తమాకి వచ్చిన గింజ కలర్ ని మార్చుకున్నారు. ఆ తర్వాత ఒక రకం కలర్ వచ్చిన వాళ్ళందరికి ఒక ఛాన్స్ అంట. బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరైతే బజర్ ముందు కొడుతారో వాళ్లకి ఛాన్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. దానికి శ్రీజ సంఛాలక్.. ముందుగా ఇమ్మాన్యుయల్ బజర్ కొట్టడంతో తనని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్.

నీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను.. ఒకటి మీ నాన్న నుండి లెటర్.. దీనికి బ్యాటరి బోర్డు నుండి ఫార్టీ(నలభై( శాతం బ్యాటరీ తగ్గుతుంది. రెండోది మీ అమ్మ వాయిస్ మెసేజ్.. దీనికి థర్టీ ఫైవ్(ముప్పై అయిదు) తగ్గుంది. మూడు మీ ఫ్యామిలీ ఫోటో దీనికి ట్వంటీ ఫైవ్ తగ్గుందని బిగ్ బాస్ అనగానే ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. అందరికి ఛాన్స్ రావాలని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో ఫ్యామిలీ ఫోటో సెలక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఫోటో వస్తుంది. ఫోటోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగతా హౌస్ మేట్స్ తమకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తుంటారు. హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ ఫోటోస్, కాల్, మెసెజెస్ ఇలా ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి మరి

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.