English | Telugu

Bigg Boss 9 Telugu:  దువ్వాడ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసిన తనూజ.‌ అసలు కారణమిదే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఎన్నో ట్విస్ట్ లతో సాగింది. ప్రతీ వారం లాగే ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. రమ్య మోక్ష ఎలిమినేషన్ తో ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

హౌస్ లోని కొంతమందికి గోల్డెన్ బజర్ పొందడానికి అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇక ఈ గోల్డెన్ బజర్ టాస్క్ లో తనూజా, డెమోన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి పాల్గొనగా... తనూజా గోల్డెన్ బజర్ ను గెలుచుకుంది. 'గోల్డెన్ బజర్' పవర్ ను గెలుచుకున్న తనూజానే దువ్వాడ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇందులో భాగంగా మూడు ఆప్షన్స్ ఇచ్చాడు నాగార్జున. ఒకటి డైరెక్ట్ నామినేషన్. రెండు వాష్ రూమ్, గార్డెన్ క్లీనింగ్.. మూడు వీక్ అంతా ఇన్విజిబుల్ అనే ఆప్షన్లు ఇచ్చాడు నాగార్జున. కానీ తనూజా మాత్రం ఊహించని విధంగా దువ్వాడ మాధురిని డైరెక్ట్ నామినేట్ చేసింది. ఆ ఇన్విజిబుల్ కేప్ ను ఎవరికి ఇస్తావని అడగ్గా, నా మమ్మికే అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ సంజన ఒప్పుకోకపోవడంతో వంద సెకెండ్ల టైమ్ ఇస్తా. హౌస్ మేట్స్ ను కన్విన్స్ చేసుకోమన్నాడు నాగార్జున. ఈ బంపర్ ఆఫర్ నాకెందుకంటూ గట్టిగా అరవడానికి ట్రై చేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ఓటింగ్ అడిగి, టై కావడంతో మళ్ళీ ఇమ్మూని నాగార్జున ఇరికించాడు. దీంతో ఇమ్మాన్యుయల్ సంజనాకే కేప్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి దొంగతనం చేసిన వీడియోను ఫన్నీగా ప్లే చేశాడు. సుమన్ శెట్టి, తనూజాతో పాటు పానీపూరీ టాస్క్ లో దొంగతనంగా తిన్న వీడియోను కూడా ప్లే చేసి నవ్వించారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.