English | Telugu

Bigg Boss 9 Telugu: కన్నీళ్ళు పెట్టుకున్న సుమన్ శెట్టి.. రీతూని నామినేట్ చేసిన సంజన!

బిగ్ బాస్ సీజన్-9 లో మొదటి రెండు వారాలు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సుమన్ శెట్టి ఆటతీరు ఉంది. హౌస్ లో తన నామినేషన్ అయిన ఆటతీరు అయిన అందరికి నచ్చేస్తుంది. అంతలా కనెక్ట్ అయిన సుమన్ శెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఇక నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ కాస్త కొత్తగా సాగింది. బిగ్ బాస్ రూల్ చెప్పాడు. బజర్ మోగిన వెంటనే మీ ముందున్న బొమ్మల్లోని వేరే వాళ్ల ఫొటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్‌లోకి ముందుగా పరిగెత్తాలి.. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫొటో ఉంటే వారిద్దరూ నామినేషన్ జోన్‌లికి వస్తారు.. చివరికి వారిద్దరిలో ఒకరు నేరుగా ఇంటి నుంచి బయటికివెళ్లేందుకు నామినేట్ అవుతారు.. దివ్య మొదటి రౌండ్‌కి సంచాలకులు అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ రెడీగా బజర్ కోసం వెయిట్ చేశారు. ఇక మొదటి రౌండ్ లో సంజన లాస్ట్ వస్తుంది. ఇక తను రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి ఏడుస్తుంది. ఇక రీతూ తన దగ్గరికి వెళ్ళి.. ఇది ఒక ప్రక్రియ., దీనికి ఏడ్వాల్సిన అవసరం లేదని చెప్పి సంజనని ఓదారుస్తుంది.

ఇక రెండో రౌండ్ లో చివరిగా సుమన్ శెట్టి మిగిలిపోయాడు. అయితే సుమన్ చేతిలో తనూజ బొమ్మ ఉంది. దీంతో సుమన్ శెట్టి-తనూజ ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తనూజ ఇక్కడ చాలా సూటిగా ఒక ముక్క చెప్పింది. నేను అయితే సుమన్ అన్నని నామినేట్ చేయాలనుకోవడం లేదు.. అంతకుముందు నేను ఒకసారి అన్నని నామినేట్ చేశాను.. మీరు యాక్టివ్‌గా లేరు అంటూ కానీ తర్వాత తను సూపర్ హీరో అయిపోయాడు.. కనుక ఇప్పుడు నాకు సుమన్ అన్నని నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవని తనూజ చెప్పింది. ఇక సుమన్ శెట్టి అయితే ఎమోషనల్ అయిపోయాడు. నేను త్వరగా లోపలికి పరిగెత్తలేకపోయాను.. నా చేతిలో తనూజ బొమ్మ ఉండిపోయింది.. నాకు తనూజని నామినేట్ చేయాలని లేదు.. అందుకే నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా అని సుమన్ అన్నాడు. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఆ రౌండ్ సంచాలక్ అయిన సంజన.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇది చాలా ఎమోషనల్ గా సాగింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.