English | Telugu

Bigg Boss 9 Telugu: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీజ దమ్ము ఎలిమినేషన్.. తన రీఎంట్రీ కోసం ఫైట్!

బిగ్ బాస్ సీజన్-9 నుండి అయిదో వారం అనూహ్యాంగ బయటకు వచ్చింది దమ్ము శ్రీజ. కామనర్స్ గా అగ్ని పరీక్షలో అర్హత సాధించి సీజన్-9 లోకి అడుగుపెట్టింది శ్రీజ. ముందు రెండు వారాలు.. ఏంటమ్మ సోది అనేట్లు తన ప్రవర్తన ఉంది. ఎప్పుడైతే నాగార్జున అవసరం ఉంటేనే మాట్లాడు అని వీకెండ్ లో చెప్పాడో అప్పటి నుండి తన మాట తీరులో మార్పు వచ్చింది.

టాస్క్ పరంగా శ్రీజ సివంగిలా దూసుకుపోతుంది. హౌస్ లో అందరు ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారు. శ్రీజని మాత్రమే కార్నర్ చేశారు కానీ లాస్ట్ వారం కళ్యాణ్ ఒక్కడే శ్రీజకి సపోర్ట్ ఇచ్చాడు. అయిన ఎక్కడ పట్టు వదలకుండా టాస్క్ లో వంద శాతం ఎఫర్ట్స్ పెట్టింది శ్రీజ. ఓటింగ్ ప్రకారం శ్రీజ టాప్-3 లో ఉంది. తనకంటే లీస్ట్ లో డిమాన్ పవన్, రీతూ, ఫ్లోరా ఉన్నారు. మొదటి ఎలిమినేషన్ ఫ్లోరా అంటే లీస్ట్ లో ఉంది ఎలిమినేట్ అయింది కానీ శ్రీజ ఆడియన్స్ ఓట్లతో కాకుండా వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారి ఒపీనియన్ ఆధారంగా ఎలిమినేట్ చెయ్యడం అనేది తప్పు నిర్ణయం.

సోషల్ మీడియాలో మొత్తం శ్రీజ ఎలిమినేషన్ టాపిక్ నడుస్తుంది. అసలు ఆడియన్స్ ఓట్లకి లెక్క లేదా.. వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వారి ఒపీనియన్ తీసుకొని ఎలిమినేట్ చెయ్యడమనేది తప్పు అని అంటున్నారు. శ్రీజ దమ్ము రీఎంట్రీ కోసం మేమ్ ఫైట్ చెయ్యడానికి రెడీగా ఉన్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ ల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మాజీ కంటెస్టెంట్స్ రివ్యూవర్స్ అందరు శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ చెప్తున్నారు. శ్రీజకి రీఎంట్రీ ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.