English | Telugu

Bigg Boss 9 Telugu : మాధురి వర్సెస్ సంజన.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఒకరినొకరు కొట్టుకునే దాకా వచ్చారు. నిన్నటి నామినేషన్లో మాధురి, సంజనల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. అసలేం జరిగిందో చూసేద్దాం..

సంజనని సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. ఇక నామినేషన్ ప్రక్రియ అయ్యాక సుమన్ శెట్టి దగ్గరికి సంజన వచ్చి.. మీరు నన్ను ఆ పాయింట్స్ తో ఎలా నామినేట్ చేస్తారండి. మీరు ఫెయిల్యూర్ కెప్టెన్ అసమర్ధత గల కెప్టెన్ అని సుమన్ శెట్టిపై సంజన గొడవకి దిగుతుంది.

సరే అమ్మా నాకూ నామినేషన్ కి మరొక పాయింట్స్ ఇచ్చావని సుమన్ అంటాడు. ఇక అక్కడే ఉన్న మాధురి మధ్యలో దూరుతుంది. అసమర్ధత కెప్టెన్ అంట.. ఇలాంటి తెలుగు పదాలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ ఏదైనా తప్పు మాట్లాడారని అడిగితే మాత్రం నాకు తెలుగు సరిగ్గా రాదు.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటుందని మధురి అంటుంది. అది సంజన విని నన్నే అంటున్నారు కదా అని మాధురితో గొడవపడుతుంది. నీకు బుర్ర లేదు.. సెన్స్ లేదని సంజనని మాధురి అంటుంది.

దాంతో సంజనని ఇమ్మాన్యుయల్ పక్కకి తీసుకొని వెళ్లి జరిగిన దాంట్లో తప్పు నీదే.. సుమన్ శెట్టి అన్నని అసమర్ధత కెప్టెన్ అనొచ్చా.. తప్పు కదా.. ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్.. ఇప్పుడు ఎలా ఉంటున్నావని సంజనకి చెప్తాడు. దాంతో సంజన పక్కకి వచ్చి నాకు బ్రెయిన్ లేదట.. సెన్స్ లేదట అని ఏడుస్తుంది. సంజన వర్సెస్ మాధురి మధ్య గొడవలు మొదటి నుండి కొనసాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.