English | Telugu

Bigg Boss 9 Telugu Family Week: హౌస్ లోకి సంజన ఫ్యామిలీ ఎంట్రీ.. ఎమోషనల్ ఎపిసోడ్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ‌ఇందులో భాగంగా రెండో రోజు కూడా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ వచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబు వల్ల గతవారమే సంజన ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేసింది. నిన్నటి నుండి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటే సంజన ఎమోషనల్ అయింది. ప్లీజ్ బిగ్ బాస్ నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అంటూ కెమెరాకి మొరపెట్టుకోవడం తెలిసిందే అయితే బిగ్ బాస్ కరిగిపోయి మిగతా కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీ వీక్ లోని కొంత టైమ్ సంజనకి త్యాగం చేయాలని చెప్తాడు.

దాంతో ఇమ్మాన్యుయల్ పది నిమిషాలు, భరణి అయిదు నిమిషాలు కళ్యాణ్ అయిదు నిమిషాలు ఇవ్వగా సంజన ఫ్యామిలీ టైమ్ ఇరవై నిమిషాలు అవుతుంది. ఇక కాసేపటికి సంజన ఫ్రీజ్ లో ఉండగా అప్పుడే తన పిల్లలు భర్త హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి సంజన ఎమోషనల్ అవుతుంది. తన అయిదు నెలల కిడ్ ని చూసి సంజన హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొదటి నుండి నా చిన్నపాపని వదిలేసి వచ్చాననే ఎమోషన్ అయితే క్యారీ చేస్తూ వచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.