English | Telugu

Bigg Boss 9 Telugu Family week: బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి సందడి.. తనూజ ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ రానే వచ్చింది. టైటిల్ విన్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అని అనుకునే కంటెస్టెంట్స్ చాలామంది ఉంటారు. ఎందుకంటే తమ ఫ్యామిలీ హౌస్ లోకి రావడం వారికి ఓ మంచి జ్ఞాపకం. అందుకే తమ ఫ్యామిలీలోని ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో కన్పించాలనేది ప్రతీ ఒక్కరి కల. అయితే హౌస్ లో ఆ సందర్బం రానే వచ్చింది.. ఆ ఫ్యామిలీ వీక్ మొదలైంది.

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు పన్నెండో వారంలో ఫ్యామిలీ వీక్ మొదలైంది. తాజాగా వచ్చిన ప్రోమోలో హౌస్ కెప్టెన్ అయిన తనూజకి మొదటగా ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారు. తనూజ సిస్టర్ తో పాటు తనూజ వాళ్ళ అక్క కూతురు వచ్చింది. మొదటగా తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. అక్కడ తనూజ వాళ్ళ అక్క పాపని ఉంచి తనని బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాపని హౌస్ లోకి తీసుకొని వెళ్లి అందరికి పరిచయం చేసింది తనూజ. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ని మెయిన్ గేట్ ద్వారా ఎంట్రీ ఇప్పించారు బిగ్ బాస్. తనని చూసి తనూజ ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే త్వరలో తనూజ సిస్టర్ మ్యారేజ్ ఉంది.

తను ఆ పెళ్లిని మిస్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ తన చెల్లిని పెళ్లి కూతురు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేయించాడు. తనూజ తన సిస్టర్ అనుజని పెళ్లికూతురు చేస్తుంది. ఆ తర్వాత అనుజ తన సిస్టర్ తనూజ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తన వెడ్డింగ్ కార్డ్ ని తనూజకి చూపిస్తుంది. దాంతో తనూజ ఎమోషనల్ అవుతుంది. తనూజకి ఈ ఎపిసోడ్ మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. తనూజకి తన గేమ్ గురించి అనుజ హింట్స్ ఇచ్చిందో లేదో చూడాలి మరి. ఈ ఫ్యామిలీ వీక్ తనూజ ఆటలో ఏదైనా మార్పు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.