English | Telugu

Bigg boss 9 Telugu : లవ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ అయిన ఇమ్మాన్యుయేల్!

బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగో వారం ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం వెబ్ సిరీస్ టీమ్ వస్తారు. అందులో భాగం గా హౌస్ మేట్స్ లవ్ స్టోరీ ని షేర్ చేసుకోమని అడుగుతారు. ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీని మొట్టమొదటి సారిగా రివీల్ చేసాడు.

నేను స్టాండింగ్ కామెడీ చేస్తున్నాను.. అవి చూసి ఒకమ్మాయి మెసేజ్ చేసింది.‌ పరిచయం అయింది.. నెంబర్ ఇచ్చింది. కానీ అప్పుడు నాకు ఎలాంటి ఫేమ్ లేదు. డబ్బు కూడా లేదు.. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే అని ఫిక్స్ అయ్యాను కానీ ఎప్పుడు తనని డైరెక్ట్ గా చూడలేదు.. ఒకసారి ఊరు వెళ్తున్న కార్ తీసుకొనిరా వెళ్తు మాట్లాడుకుందామని అంది. నేను ఫ్రెండ్ కార్ తీసుకొని వెళ్లినా ఫోర్ అవర్స్ చాలా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను షూటింగ్ అంటూ బిజీ అయిపోయి తనపై చిరాకు పడ్డాను. కానీ ఇప్పటివరకు తనకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు.. ప్రతి బర్త్ డే కి డ్రెస్ తీసుకుంటా కానీ అది వేసుకోదు.. పెళ్లి అయ్యాక వేసుకుంటా అంటది.. అన్నీ నా బీరువాలో ఉన్నాయి.

కానీ ఇన్నిరోజులు నీపై చిరాకు పడ్డాను.. ఇప్పుడు తెలుస్తుంది. నేను ఎంత కోప్పడ్డా నాపై ప్రేమ చూపిస్తుంది. ఈ నవంబర్ కి తను పారెన్ వెళ్ళాలి.. కానీ నాకోసం ఆగిపోయింది.. నిన్ను ఎప్పుడు వదులుకోను వీలైతే ఫ్యామిలీ వీక్ అప్పుడు.. రా.... నీకోసం మాత్రమే ఆడుతున్నా.. కప్ కొట్టి నీ చేతిలో పెడుతానే.. రోజు అందరిని నవ్విస్తాను కానీ రాత్రి దుప్పటి కప్పుకొని ఎంత బాధపడుతానో నాకు తెలుసని ఇమ్మాన్యుయల్ తన లవ్ స్టోరీ చెప్తూ ఏడుస్తాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.