English | Telugu

Bigg Boss 9 Telugu : దువ్వాడ మాధురి వీరంగం.. రీతూ, దివ్యలపై పర్సనల్ ఎటాక్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం క్రేజీగా సాగుతోంది. అయిదో వారం వరకు కామ్ అండ్ కూల్ గా సాగిన హౌస్.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత గందరగోళంగా మారింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. హౌస్ లో ఈ వీక్ ఫుడ్ మానిటర్ గా దివ్య, మెయిన్ షెఫ్ గా మాధురి ఉన్నారు. కిచెన్ కి సంబంధించిన ఫుడ్ ఏది తిన్నా కూడా ఫుడ్ మానిటర్ గా ఉన్న దివ్యకి చెప్పాలి. దివ్య తనే అందరికి సరిపోయేలా ఫుడ్ పెడుతుంది కాబట్టి ప్రతీది తనకి చెప్పాలి.

అయితే దివ్యకి చెప్పకుండా దువ్వాడ మాధురి కర్రీ వేసుకుంది. అది తెలుసుకున్న దివ్య.. నాకు చెప్పలేదు అలా చెయ్యకూడదని దివ్య స్మూత్ గా చెప్తుంది. నేను కొంచెమే వేసుకున్నాను.. నీకెందుకు చెప్పాలి.. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ఏదైనా నీకెలా చెప్తానని మాధురి అంటుంది. ఈ ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు తీసెయ్యండని పొగరుగా కళ్యాణ్ తో దువ్వాడ మాధురి చెప్తుంది. నాకు మీతో పర్సనల్ గా బాండింగ్ వద్దన్నాను.. ఇలా వర్క్ పరంగా ఏదైనా చెప్పొచ్చని దివ్య అంటుంది. నేను మీతో ఏం బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు.. నీలా ఎప్పుడు నాన్న నాన్న అంటు తిరగనని మాధురి అంటుంది. ఎవరన్నారని దివ్య అడుగుతుంది. ఎవరంటే వాళ్ళకి.. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు .. ఎందుకు నిన్ను అన్నానని భుజాలు తడుముకుంటున్నావని మాధురి అంటుంది.

అలా ప్రతీదాంట్లో దూరి కావాలనే గొడవ చేస్తుంది దువ్వాడ మాధురి. రీతూ, అయేషా విజిల్స్ క్లీనింగ్ దగ్గర గొడవ పెట్టుకుంటుంటే మాధురి మధ్యలో దూరి రీతూతో గొడవ పెట్టుకుంటుంది. హౌస్ లో కెప్టెన్ అయిన కళ్యాణ్ తో కూడా గొడవపెట్టుకుంది. తను ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియక కెప్టెన్ కళ్యాణ్ భయంతో సైలెంట్ గా ఉంటున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.