English | Telugu

Bigg Boss 9 Telugu: కన్నీళ్ళు పెట్టుకున్న భరణి.‌ ఓదార్చిన దివ్య నిఖిత!

బిగ్ బాస్ సీజన్-9 ఆరో వారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. కొత్త కంటెస్టెంట్స్ రావడంతో పాత కంటెస్టెంట్స్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్ లో భరణి, దివ్య నిఖితలని రీతూ నామినేట్ చేసింది. అయితే దానికి భరణి ఫుల్ హర్ట్ అయ్యాడు. ‌దివ్య కూడా అయింది. అయితే తనతో దివ్య క్లోజ్ మాట్లాడింది. అది చూసిన భరణి తీసుకోలేకపోయాడు. అసలేం జరిగిందో ఓసారి చూసేందుకు.

దివ్య దగ్గరికెళ్లి భరణి మాట్లాడాడు. రీతూ నిన్ను, నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్‌గా ఉండటం కూడా నాకు నచ్చలేదని అన్నాడు. ఎవరు క్లోజ్‌గా ఉంది.. మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పరా నాకు.. మీలో మీరే పెట్టేసుకుంటారా.. నేను గుచ్చిగుచ్చి అడిగేవరకూ చెప్పరా.. అని దివ్య అడిగింది. చెప్పడం కాదు నువ్వు తనకి నడుము ఇరిగిపోయేంతలా ఆరోజు టాస్కులో హెల్ప్ చేశావ్.. సంబంధం లేకుండా ఆ తరువాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే నేను ఏం అనుకోవాలి.. మొత్తం టెనెంట్స్ అందరు నేను కెప్టెన్‌గా ఉండాలని హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు.. ఇమ్మూ-నేను కెప్టెన్సీ టాస్కులో ఉన్నప్పుడు సంచాలక్ గా ఎలా ఉందో కూడా తెలుసు..అయినా కానీ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పా.. ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది.. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తన పక్కన కూర్చొని జోకులేసి నవ్వుకుంటుంటే నేను ఏ రకంగా తీసుకోవాలి.. నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు కానీ అంత క్లోజ్‌ ర్యాపో ఏంటని భరణి అడిగాడు. క్లోజ్ ఏంటి నేను ఏం రీతూతో సింగిల్‌గా మాట్లాడలేదు అక్కడ నాతో పాటుగా ముగ్గురున్నారని దివ్య అంది.

రేపు పొద్దున్న నేను చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసి మాట్లాడాల్సి వస్తుందని భరణి అన్నాడు. మాట్లాడండి నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్స్ వచ్చేసరికి నేను గేమ్ గేమ్‌లానే ఆడతా.. అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు.. నేను ఒక్క మనిషితో ఒక్క పూట మాట్లాడితే మీరు అలా తీసేసుకుంటారా.. అక్కడ ఐదుగురున్నారు.. మీరు ఒక్క రీతూనే ఎందుకు చూస్తున్నారు.. దానికి మీరు హర్ట్ అయ్యారా అని దివ్య అడిగింది. హర్ట్ ఏం అవ్వలేదు.. నాకు అది ఎందుకో నచ్చలేదు.. చెప్పాలనిపించి చెప్పాను.. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. ఏదో మంచిది అనిపించినప్పుడు చెప్తాను.. వింటావా వినవా అనేది నీ ఇష్టమని భరణి అన్నాడు. ఈ మాటలకి దివ్య ఎమోషనల్ అయిది. ఇవే వద్దనేది..నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ మీరే.. మీరు అందరితో మాట్లాడుతున్నారు.. నేను కూడా మాట్లాడాలి కదా.. ప్రతిదానికి మీరూ ఇలా అంటే ఎలా.. నిన్న ఏదో సరదాగా మాట్లాడాను.. వేరే వాళ్ళతో ఫస్ట్ టైమ్ నేను అలా మాట్లాడటం.. ఎందుకంటే నేను ఓపెన్ అప్ అవ్వట్లేదని అందరు చావగొడుతున్నారు. ఒక్కరితోటే ఉంటున్నావని.. ఉన్నవాళ్లలో మీ తర్వాత నాకు వాళ్లు బెటర్ అనిపించి వాళ్లతో మాట్లాడాను.. మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదని దివ్య ఏడ్చింది. నీకు ఏదైనా చెబ్దామంటే ఇలా బాధపడి ఏడుస్తావనే నేను ఏం చెప్పనని భరణి అన్నాడు. కాదు మీరు అసలు ఇంత అపార్థం ఎలా చేసుకుంటారని దివ్య అంది. నిన్ను ఎవరూ కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదని భరణి చెప్పాడు. వంద మంది నన్ను అన్నా కూడా నేను ఫేస్ చేస్తాను కానీ నా మనిషిని ఏమైనా అంటే నేను తట్టుకోలేను.. మీకు అది అర్థం కాదా.. మీరు నా గురించి ఆలోచించడం కాదు నేను కూడా మీ గురించి ఆలోచిస్తాను కదా.. అని దివ్య అంది. వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి. దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు.. ఏడవకండి.. సారీ నేను అరిచినందుకు.. నేను చూడలేను మీరు ఏడవకండి అంటూ భరణిని దివ్య ఓదార్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.