English | Telugu

Bigg Boss 9 Telugu Shobha shetty : హౌస్ లోకి శోభాశెట్టి.. కెప్టెన్సీ రేస్‌లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరంటే!


బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడంతో ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానితో పాటు కెప్టెన్సీ కోసం టాస్క్ లతో ప్రతీ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ అవుతుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ రాగా అతడితో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. ఇక సోహెల్ తో రీతూ, సంజన పోటీపడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఇప్పటివరకు భరణి, తనూజ, సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, రీతూ, సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అయితే యావర్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ జరిగిన టాస్క్ హోరాహోరీగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ తో రీతూ చౌదరి, సంజన పోటీపడ్డారు. సోహెల్ ఓడిపోవడంతో రీతూ , సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు‌. ఇక తర్వాత శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఇమ్మాన్యుయల్ తో మాట్లాడింది. ఇక ఆ తర్వాత దివ్యతో కెప్టెన్సీ రేస్ లో పాల్గొంది శోభాశెట్టి. ఇందులో దివ్య ఈజీగా గెలిచింది.

ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్క్ లలో అందరు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఇక వీరిలో సుమన్ శెట్టి, భరణి, తనూజ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా.. దివ్య, సంజన, రీతూ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, కళ్యాణ్ మొత్తం ఆరుగురు కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. మరి వీరిలో కెప్టెన్ అయ్యేదెవరు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.