English | Telugu

బెజవాడ బేబక్కకు తృటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే 17వ ఫ్లోర్ నుంచి కిందపడి...

బిగ్‌బాస్ సీజన్ 7లో ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఫన్ ని బాగా మిస్సయ్యారు. దాంతో బిగ్ బాస్ సీజన్ 8 లో బెజవాడ బేబక్కను దించారు. ఇక ఆమె తన మాటలతో, కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఆమె ఎం మాట్లాడినా అందులో వెటకారం బాగా ఉంటుంది. ఐతే ఆమె ఉండేది బెజవాడలో. అక్కడ ఎక్కువగా బేబమ్మలు, బేబక్కలు ఎక్కువ కాబట్టి వాళ్లకి కనెక్ట్ కావడం కోసమే బెజవాడ బేబక్కగా మారిందని బిగ్ బాస్ హౌస్ లో చెప్పుకొచ్చింది. అలాంటి బేబక్క ఇప్పుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి మరీ తానే చెప్పుకుంది. తన డ్రెస్ మొత్తానికి అంటిన సిమెంట్ ని మట్టిని చూపిస్తూ ఒక వీడియో చేసింది.

"మరి మాములుగా ఉండదండి మనతో. 17 వ ఫ్లోర్ లో పడిపోయాను. అక్కడ సిమెంట్ అంతా వేశారు. దాంతో నేను చూసుకోలేదు.. ఇంకొంచెం ఉంటే.. స్లిప్ అయ్యి 17 వ ఫ్లోర్ నుంచి కింద పడి డమేల్ అయ్యేదాన్ని. రేపటి నుంచి ఎవరు చేస్తారు మీకు వీడియోస్ చెప్పండి. కన్స్ట్రక్షన్ పేరు చెప్పను.. ఎందుకంటే వాళ్ళ తప్పు లేదు. బై ఫ్రెండ్స్ ..నేను బానే ఉన్నా" అంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇక తన యోగక్షేమాన్ని చెప్పాక నెటిజన్స్ "అట్లా ఎందుకు మాట్లాడుతారు మీరు ? మంచిగా ఉండాలి ఎప్పుడూ...మీరు సేఫ్ గా ఉన్నారు కదా." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బెజవాడ బేబక్కగా యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈమె అసలు పేరు మధు నెక్కంటి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఈమెకు స్వయానా పెద్దనాన్న. బెజవాడ బేబక్క అమ్మ గారి అక్కనే రాఘవేంద్రరావు వివాహం చేసకున్నారు. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, ఆ తర్వాత అక్కడే కొన్ని షోస్ కి యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్‌గా, స్టాండప్ కమెడియన్‌గా బేబక్క తనలోని టాలెంట్ మొత్తం చూపించింది. ఇక ఇండియాకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కంపోజింగ్‌‌లో పలు సాంగ్స్ పాడింది. నరేష్-పవిత్ర లోకేష్ చేసిన 'మళ్లీపెళ్లి' సహా 15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.