English | Telugu

రెండు రూపాయల కోసం రిక్షా తొక్కిన సందర్భాలు ఉన్నాయి


ఇస్మార్ట్ జోడి 3 ఈవారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఈ వారం జోడీలను గ్రూప్స్ గా డివైడ్ చేశారు హోస్ట్ ఓంకార్. అనీల్ గీలా- ఆమని, రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత, అలీ రెజా - మాసుమా, ఆదిరెడ్డి - కవిత , లాస్య - మంజునాథ్ ని కలిపి టోటల్ ఫైవ్ జోడీస్ ని గ్రూప్ ఏలో పెట్టాడు. అనిల్ గీలా-ఆమని ఇద్దరూ ఈ స్టేజి మీద కన్నీళ్లు పెట్టేసుకున్నారు. "మా నాన్న ఊళ్ళో రిక్షా తొక్కుతూ ఉండేవాడు. రెండు రూపాయల కోసం నేను రిక్షా తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా లైఫ్ లోకి ఆమని వచ్చాక మా ఊళ్ళో నా పేరు బాగా తెలిసింది.

నా యూట్యూబ్ ఛానల్ కి వ్యూయర్ షిప్ కూడా బాగా పెరిగింది. నాకు ఆమని అంటే ఇష్టం. నేను ఎప్పుడైనా కష్టపడే పరిస్థితి స్ట్రెస్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్తుంది. నాతో కలిసి పనిచేస్తూ నాకు తోడుగా ఉంటుంది. ఒక నైట్ మా జీవితం ఎటు పోతోంది అంటూ డిస్కషన్ కూడా జరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ కూడా ఎమోషన్ ఇపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి ఓంకార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఐతే హనీమూన్ కి ఎక్కడికి తీసుకెళ్లాలో అడుగు అని ఆమనిని అడిగేసరికి కాశ్మీర్ అని చెప్పింది. దాంతో ఇద్దరినీ కాశ్మీర్ వెళ్లాలని వెళ్లినట్టు ప్రూఫ్ కూడా చూపించాలని ఓంకార్ చెప్పాడు. ఇక అనీల్ గురించి చెప్పాలంటే మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్‌లో ఎంటర్‌టైనింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇందులోనే గంగవ్వతో అనిల్ చాలా వీడియోలు చేశాడు. బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా అవకాశం వచ్చినట్లే వచ్చి అనీల్ చేజారిపోయింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో ఒకసారి చెప్పుకొచ్చాడు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.